For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొన్ని సెకెన్ల సీన్ కొసం ఇంత రిస్కా..? అప్పుడు బైకు.., ఇప్పుడు కారు చేతులతో లేపేసాడు

  |

  బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం హీరోగా గతంలో ఫోర్స్ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఫోర్స్-2 తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో జాన్ బిజీగా ఉన్నాడు. సినిమా షూటింగ్‌లో జాన్ అబ్రహం చేసిన ఒకేఒక్క పని వల్ల వార్తల్లో నిలిచాడు. ఫోర్స్ సినిమాలో పల్సర్ బైక్‌ను చేతులతో పట్టుకుని గాల్లోకి లేపిన ఈ హీరో... ఫోర్స్-2లో అంతకన్నా ఎక్కువ బరువే ఎత్తాడు. అది అంతాఇంతా కాదు.... ఏకంగా 1580 కిలోలు. మెర్సెడ్స్ బెంజ్ కారును జాన్ అబ్రహం రెండు చేతులతో పట్టుకుని గాల్లోకి లేపాడట.

  "ఫోర్స్‌-2" సినిమాలో ఓ సీన్‌లో డూప్ సాయం తీసుకోకుండా రియల్‌ రిస్కీ స్టంట్‌ చేశాడు. గతంలో వచ్చిన "ఫోర్స్" చిత్రంలో డూప్ సాయం లేకుండా జాన్ అబ్రహం ఓ పెద్ద బైక్‌ను ఎత్తి కనిపించిన విషయం తెలిసిందే. అప్పట్లో సినిమాకున్న ప్లస్ పాయింట్స్ లో అది కూడా ఒకటి. అయితే, బైకుని నిజంగా ఎత్తలేదని, ఆ సీన్‌ను ఫోటోగ్రఫీతో మేనేజ్‌ చేశారని జాన్ పై పలువురు ఆరోపణలు గుప్పించారు. దాంతో ప్రేక్షకులను నమ్మించడానికి జాన్ ఆ చిత్ర ప్రచారంలో పాల్గొంటూ అందరి ముందు బైక్‌ని లేపి చూపించాడు.

  John Abraham lifts a 1580 kg car in Force 2

  1580 కిలోలు బరువున్న బెంజ్‌ కారును డూప్ సాయం లేకుండా ఎత్తాల్సి ఉండ‌గా ఆయన ఒక్కడే దాన్ని మోయడం సాధ్యం కాద‌ని, మ‌రో ఇద్ద‌రి సాయంతో జాన్‌ కారు ఎత్తగలిగాడ‌ని దర్శకుడు విపుల్‌ అమృత్‌లాల్‌ షా పేర్కొన్నాడు. అయితే ఆ ఇద్దరూ కూడా కారుని ఎత్తేసమయం లో మాత్రమే సాయం చేసారనీ తర్వాత జాన్ మాత్రం అంతటి బరువునీ మోస్త్తు కొద్దిసేపు ఉన్నాడనీ చెప్పాడు.

  అయితే మరీ వింత విషయం ఏమిటంటే అసలు చిత్రంలో కారు ఎత్తే సీనుకు అంత‌గా ప్రాధాన్య‌త ఏమీ లేదట. ఒక యాక్షన్ సీన్లో కొన్ని సెకెన్లు మాత్రమే ఉండే ఈ సీన్ కి అంత సీన్ లేక‌పోయినా సన్నివేశం రియలిస్టిక్‌గా అనిపించడానికి జాన్ అబ్రహం ఈ ప‌నిచేసిన‌ట్లు, అసలు సినిమాలో అంత అవసరం లేకపోయినా సన్నివేశం రియలిస్టిక్‌గా అనిపించడానికి జాన్‌ కారు ఎత్తాలనుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయమేనని, జాన్‌ కష్టపడిన దానిలో మరొకరైతే పదో వంతు కూడా చేయలేరని చెప్పారు.

  John Abraham lifts a 1580 kg car in Force 2

  ఈ యాక్షన్ సీన్‌ను చిత్ర దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడట. సినిమాకే హైలైట్‌గా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఈ సీన్ చేయడం కోసం జాన్ చాలా కష్టపడ్డాడని టాక్. 6 నుంచి 7 గంటల వరకూ జిమ్‌లోనే గడిపేవాడట. అయితే గతంలో జాన్ బైక్ లిఫ్ట్ చేసినప్పుడు ఇదంతా నిజం కాదని కొందరు వాదించారు. కానీ ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో స్వయంగా ఈ కండల వీరుడే సమాధానమివ్వడంతో వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఈ సీన్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. ఫోర్స్-2లో జాన్‌కు జంటగా సోనాక్షి సిన్హా నటిస్తోంది. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ తెచ్చుకుంది.

  English summary
  After lifting a bike in Force, John Abraham lifts a 1580 kg car in Force 2
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X