»   » రీమేక్ ఓకే... హీరోలు ఎవరో చెప్పలేదు

రీమేక్ ఓకే... హీరోలు ఎవరో చెప్పలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నటుడు, నిర్మాత జాన్ అబ్రహం..తన తాజా చిత్రం రాకీ హ్యాండ్సమ్ తో యాక్షన్ ని మరో కొత్త లెవిల్ కు తీసుకు వెళ్లారు. ఆయన ఇప్పుడు తన చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

జాన్ అబ్రహం మాట్లాడుతూ..."మేం మా సినిమాను సౌత్ కు రీమేక్ చేయాలనకుంటున్నాం. ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఉన్న సూపర్ స్టార్ తో టచ్ లోకి వెళ్తాం. హైదరాబాద్ లోని ఇద్దరు ముగ్గరు హీరోలు చూసి తెలుగు,తమిళంలో చేయటానికి ఇంట్రస్ట్ చూపారు. ఎందుకంటే ఇది చాలా కమర్షియల్ ప్రాజెక్టు. ఇలాంటి ఆఫర్స్ రావటం చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉంది ." అన్నారు.

John Abraham plans to remake 'Rocky Handsome' in Tamil and Telugu

ఇక ఆ హీరోలు ఎవరనేది చెప్పటానికి జాన్ అబ్రహం ఆసక్తి చూపలేదు. ఈ సినిమా యుఎస్ పి గురించి చెప్తూ... కేవలం యాక్షన్ మాత్రమే కాక ఈ సినిమాలో ఎమోషన్ కూడా మిళితమై ఉంది అన్నారు. రాకీ హ్యాండ్సమ్‌ చిత్రానికి నిషి కామత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాకీ హ్యాండ్సమ్ చిత్రంలో శృతి అతిథి పాత్ర పోషిస్తోంది. శృతి ప్రస్తుతం రెండు హిందీ చిత్రాల్లో నటిస్తుంది. బిజి షెడ్యూల్‌లో కూడా రాకీ హ్యాండ్సమ్ చిత్రానికి శృతి డేట్స్ కేటాయించింది. తొలుత శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పారు. ఇప్పుడు అతిథి పాత్ర అని సమాచారం. కథ పాత్ర నచ్చడంతో శృతి ఓకే చెప్పిందట. హీరో, హీరోయిన్‌లతో పాటు ప్రధానమైన పాత్ర అంటున్నారు.

English summary
John Abraham, who is likely to take action in Bollywood to an altogether new level with 'Rocky Handsome', plans to remake the film in Tamil and Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu