»   » హీరో జాన్ అబ్రహం మొదటి సంపాదన ఎంతో తెలుసా?

హీరో జాన్ అబ్రహం మొదటి సంపాదన ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చాలా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో జాన్ అబ్రహం కూడా ఒకరు. మధ్య తరగతి కుటుంబ నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి తనదైన టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగాడు జాన్ అబ్రహం. అందుకే తనకు డబ్బు విలువ ఏమిటో తెలుసు అంటున్నాడు ఈ హీరో.

ఇటీవల ఓ ఇంట్వర్యూలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తన మొదటి సాలరీ వివరాలు వెల్లడించారు. రూ. 11,800లను మొదటి సాలరీ కింద పొందాడట జాన్. ఇప్పటికీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంటును మెయింటేన్ చేస్తున్నాడట. 'నా మొదటి సాలరీ రూ. 11,800, ఇప్పటికీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాతా కొనసాగిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అది ఎంతో తోడ్పడింది' అని జాన్ అబ్రహం వెల్లడించారు.

తాను ధనవంతమైన, సంపన్నమైన కుటుంబం నుంచి రాలేదని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకొచ్చారు ఈ స్టార్ హీరో. తన తల్లి ఫిరోజా ఇరానీ ఇప్పటికీ లోకల్ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుందని వెల్లడించారు. తనకు మధ్య తరగతి కుటుంబాల స్థితిగతులు తెలుసని, డబ్బు విలువ తెలుసని చెప్పుకొచ్చారు.

మోడలింగ్ రంగంలో రాణించిన తర్వాత, జిస్మ్ చిత్రం ద్వారా హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్ అబ్రహం ఆ తర్వాత ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్ స్టార్ హీరోగా, నిర్మాతగా ఎదిగారు. రీసెంట్‌గా జాన్ అబ్రహం నటించిన 'మద్రాస్ కేఫ్' చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం జాన్ దోస్తానా-2, వెల్‌కం బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

English summary
During an exclusive interview with a leading daily, John Abraham revealed that his first salary was Rs 11,800 and he still maintains an account in Bank of Maharastra. My first salary was Rs 11,800 and I still maintain that account in Bank of Maharashtra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu