»   » రిపోర్టర్‌ ఓవరాక్షన్, దాడికి ప్రయత్నించి స్టార్ హీరో!

రిపోర్టర్‌ ఓవరాక్షన్, దాడికి ప్రయత్నించి స్టార్ హీరో!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినిమా రంగంలో క్లిక్ అయితే కావాల్సినంత డబ్బు, హోదా, పలుకుబడి, సెలబ్రిటీ స్టేటస్‌‌ ఉంటుంది....వారు ఎంతో సుఖవంతమైన జీవితం గడిపేస్తారు అని అనుకుంటూ ఉంటారంతా. కానీ చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఇవన్నీ రావడం వల్ల వారికి కొత్తఇబ్బందులు కూడా మొదలువుతాయి. వాటిలో ముఖ్యమైనది ప్రైవసీ దొరకక పోవడం.

  John Abraham

  సినిమా వాళ్లు ఎక్కడికెళ్లినా....ఓ వైపు అభిమానులు, మరో వైపు మీడియా వాళ్లు వాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అందుకే చాలా మంది స్టార్స్ ప్రశాంతంగా గడిపేందుకు విదేశాలకో, తమను ఎవరూ గుర్తు పట్టని, ఏకాంత ప్రదేశాలకో వెలుతుంటారు. వీలైనంత వరకు మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. మీడియా వాళ్ల ఎదురైతే వారు ప్రశ్నలతో హింసించడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు కొన్ని సార్లు సహనం కోల్పోతుంటారు స్టార్స్.

  బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంకు ఇటీవల ఇలాంటి సంఘటనే ఎదురైంది. పూర్వ విద్యార్థుల మీటింగులో భాగంగా తాను చదివిన జై హింద్ కాలేజీకి వెళ్లారు జాన్ అబ్రహం. ఈ సందర్భంగా అక్కడ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది. అయితే ఓ రిపోర్టర్ ఓవరాక్షన్ కారణంగా జాన్ అబ్రహం సహనం కోల్పోవాల్సి వచ్చింది.

  సదరు రిపోర్టర్ జాన్ అబ్రహం, ప్రియా రాంచల్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడిక్కడ. అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సదరు రిపోర్టర్ జాన్ అబ్రహంను ప్రశ్నించారు. దీనికి జాన్ సమాధానం ఇస్తూ అలాంటి ప్రశ్నలకు ఇది సరైన సందర్భంగా కాదు అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే సదరు రిపోర్టర్ ప్రశ్నలతో వేధించడంతో సహనం కోల్పోయి అతనిపై దాడి చేసే ప్రయత్నం చేసాడు. అయితే జాన్ పర్సనల్ మేనేజర్, ఇతరులు అతన్ని ఆపారు. అది సంగతి!

  English summary
  Sometimes movie stars loose their cool and act like just like common men. This happened to John Abraham recently while he attended an alumni meet event at Jai Hind college. John lost his cool over a silly question by a reporter and charged towards him for a 'face to face' duel.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more