twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు అనుచరులనుంచి ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మోహన్ బాబు అనుచరులనుంచి తనకు ప్రాణ హాని ఉందని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. దేనికైనా రెడీ సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచే సన్నివేశాలున్నాయని జొన్నవిత్తుల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనను బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారని అన్నారు.

    "మోహన్‌బాబునే తప్పు పడతావా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతావా.. నువ్వు బ్రాహ్మణుడివా లేక మరోకులస్తుడివా (మరో కులస్తుడివా అనే పదానికి బదులు వేరే కులాన్ని కించపరిచే మాట).. సాయంత్రం ఆరుగంటలకి మీ ఇంటికి వస్తాం.. వచ్చి నీ బుర్ర బద్దలుకొడతాం'' .. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు వచ్చిన బెదిరింపులివి. 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరచడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినందున.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి ఇలా బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు.

    మరో వైపు నటుడు మోహన్‌బాబుకు ప్రదానం చేసిన 'పద్మశ్రీ' అవార్డును ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. అలాంటి అవార్డులను పేర్లకు ముందుగానీ, వెనుకగానీ తగిలించుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని.. అయితే.. మోహన్‌బాబు ఇటీవల నిర్మించిన 'దేనికైనా రెడీ' సినిమా పోస్టర్లపై ఆయన పేరుకు ముందు 'పద్మశ్రీ' అని పెట్టుకున్నారని వివరించారు. సినిమాలో కూడా పద్మశ్రీ అని వాడారని చెప్పారు. సుప్రీం ఆదేశాలను ధిక్కరించినందున మోహన్‌బాబుకు పద్మశ్రీ అవార్డును ఉపసంహరించాలన్నారు.

    దేనికైనా రెడీ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు నిరసనబాట పట్టడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. చిత్రాన్ని చూసిన కమిటీ సభ్యులు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. నిర్మాత వాదనలను కూడా విని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఇంతలోపే మోహన్ బాబు హై కోర్టును ఆశ్రయించడంతో కథ మళ్లీ మలుపు తిరిగింది. దేనికైనా రెడీ సినిమాతో పాటు ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాల సమీక్షా కమిటీ నియామకంపై హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు ధృవీకరించిన తరువాత ప్రభుత్వ వర్గాలకు సమీక్షించే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని జస్టిస్ చంద్రభాను నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది.

    English summary
    
 Noted film poet Jonnavithula Ramalingeswara Rao filed an official police complaint against threatening calls. Jonnavithula has said that the callers had abused him in unprintable language for criticizing Mohan Babu, though he had criticized only the film and not any individual.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X