»   » అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అంటోంది

అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నేనూ, నా స్నేహితులూ అల్లు అర్జున్‌కి వీరాభిమానులం. గంగోత్రి, బన్నీ, హ్యాపీ, పరుగు ఇలా అతను నటించిన సినిమాలన్నీ చూసేదాన్ని. నటినయ్యాక ఒకసారి అర్జున్‌ని కలిశా కూడా. ఇప్పటికీ హైదరాబాద్‌ బయల్దేరుతున్నానంటే చాలు నా ఫ్రెండ్సంతా 'మమ్మల్నీ తీసుకెళ్లొచ్చుగా' అంటూ తయారైపోతారు. నాకే వీలుపడదు అంటోంది జర్ని హీరోయిన్ అనన్య.

'జర్నీ'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనన్య ఇప్పుడు 'ఇంటింటా అన్నమయ్య'తో పాటు మిగతా భాషల్లో మరో పది సినిమాల్లో నటిస్తోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది.

'శ్రీరామరాజ్యం' తర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఆ యువకుడికి పాశ్చాత్య సంగీతమంటే మహా ప్రీతి. ర్యాప్‌, పాప్‌... అంటూ గిటారుపట్టుకొని ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే అన్నమయ్య కీర్తనలు విన్నాక మన సంగీతంలోని గొప్పదనాన్నీ, ఆయన రచనలోని వైశిష్ట్యాన్నీ తెలుసుకొన్నాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీదే చూడమంటున్నారు రాఘవేంద్రరావు.

English summary
Ananya says She is a Fan of Allu Arjun. present she is acting for Intinta Annamayya film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu