»   » బాలీవుడ్ పై కన్నేసిన జూ ఎన్టీఆర్!

బాలీవుడ్ పై కన్నేసిన జూ ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'శక్తి" షూటింగ్ నిమిత్తం జైపూర్ లో ఉన్నాడు. ఇప్పుడు టాలీవుద్ హీరోలు బాలీవుడ్, కోలీవుడ్ ల్లో కూడా చేయటానికి ఆసక్తి కనపరుస్తున్నారు. మరి మీరు కూడా అటు వైపు దృష్టి సారిస్తారా అని ఎన్టీఆర్ ని అడిగితే 'కోలివుడ్" పై అస్సలు దృష్టి పెట్టను. బాలీవుడ్ లో మాత్రం కొంతకాలం తర్వాత సినిమాలు చేస్తాను. జైపూర్ లో చాలా మంది నన్ను గుర్తు పట్టారు. హిందీలో రీమేక్ అయిన 'కంత్రీ" సినిమా గురించి నా దగ్గర అక్కడ జనాలు మాట్లాడారు. నన్ను అంతగా గుర్తు పెట్టుకుని నాతో మాట్లాడటం చాలా ఆనందం కలిగించింది. అందుకే బాలీవుడ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే వెంటనే కాదు" దానికి మరికొద్ది సమయం పడుతుందని చెప్పాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu