»   » ప్రభాస్ తండ్రి అంత్యక్రియలకు మొగల్తూరుకు జూ ఎన్టీఆర్

ప్రభాస్ తండ్రి అంత్యక్రియలకు మొగల్తూరుకు జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు అంత్యక్రియలకు జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోలు ఆదివారం హాజరుకానున్నారు. సినీ హీరోలు కృష్ణంరాజు, ప్రభాస్‌లు గురువారం మొగల్తూరుకు చేరుకున్నారు. ప్రభాస్‌తండ్రి సూర్యనారాయణ రాజు దశదిన కార్యక్రమాలను సొంత ఊరిలో నిర్వహించాలని కృష్ణంరాజు కుటుంబం నిర్ణయించింది. దీంతో కృష్ణంరాజు, ప్రభాస్‌, అతని సోదరుడు ప్రభోద్‌, మిగిలిన బంధువులు మొగల్తూరు వచ్చి అగ్రహారంలోని వారి సొంత ఇంటిలో బస చేశారు. గురువారం ఉదయం సూర్యనారాయణ రాజు చిత్రపటానికి కొడుకు ప్రభాస్‌, సోదరుడు కృ ష్ణంరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు విలేకరులతో మాట్లాడుతూ తమ్ముడి కోరిక మేరకు సొంత ఊరిలో అంతిమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాము ఎక్కడ ఉన్నా మొగల్తూరుని, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాల్ని మర్చిపోలేమన్నారు. తాము ఈ రోజు ఉన్నతస్థితిలో ఉండటానికి ఇక్కడి ప్రజల సహకారమే కారణమని పేర్కొన్నారు. జీవితాంతం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న ప్రభాస్‌ మాత్రం విలేకరులతో మాట్లాడడానికి నిరాకరించారు. ప్రభాస్‌ను పలుకరించడానికి నరసాపురం, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu