»   » రిపబ్లిక్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్

రిపబ్లిక్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చేయబోయే చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ 'జనతా గ్యారేజ్' సక్సెస్ తరువాత చాలా కథలు విని 'పవర్' ఫేమ్ బాబి స్టోరీని ఎన్టీఆర్ ఓకే చేసారు. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబి పూర్తి స్థాయి స్క్రిప్టును సిద్ధం చేశాడట.

కానీ చాలా రోజులుగా ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ వైపు నుండి అఫీషియల్ న్యూస్ ఏదీ రాకపోవడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని 2017 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున అధికారకంగా లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Jr NTR and Bobby movie starts on Republic Day

అలాగే ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. దాంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకి ఈ కాంబినేషన్ కుదిరింది.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఆ చిత్రం ఈ యేడాది సెప్టెంబరులో మొదలవుతుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్మాత రాధాకృష్ణ శనివారం ఈ సినిమాని ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో తీయనున్న సినిమా కోసం సన్నాహాలు చేసుకొంటున్నారు. అది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ సినిమాని పట్టాలెక్కిస్తారు.

English summary
NTR's next movie in the direction of KS Ravindra (Bobby) will be launched on January 26th during Republic day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu