»   » జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ బఫే భోజనం వంటిది...

జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ బఫే భోజనం వంటిది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, అందాల నాయికలు కాజల్‌, సమంత హీరోయిన్స్‌ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం". ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు తమన్‌ ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'ఇంతటి పెద్ద సినిమాను చేసే అవకాశాన్ని కలుగజేసిన దిల్‌ రాజుగారికి థ్యాంక్స్‌. ఈ చిత్రంలోని అన్ని పాటలు ఎక్స్‌ ట్రార్డినరీగా తీశాము. ఆగస్టులో ఆడియో రిలీజ్‌ కానున్న ఈ 'బృందావనం" బఫే భోజనం వంటిది. ఇంత నిండైన సినిమాకు వర్క్‌ చేసే అవకాశం రావటం నా అదృష్టం" అని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్, కృష్ణ చైతన్య, రాంజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అంటున్నారు తమన్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu