»   » శిల్పకళావేదికలలో యంగ్ టైగర్ ‘బృందావనం’ ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక

శిల్పకళావేదికలలో యంగ్ టైగర్ ‘బృందావనం’ ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, అందాల హాట్‌ ముద్దుగుమ్మలు కాజల్‌, సమంతా హీరోయిన్స్‌ గా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన చిత్రం 'బృందావనం". ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తున్న విషయం మీకు తెలిసిందే. కాగా ఈ చిత్రం ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ శిల్పకళావేదిలో అతిరధ మహారధులతో పాటు నందమూరి అభిమానుల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, వి.వి. వినాయక్‌, ప్రకాష్‌ రాజ్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, దిల్‌ రాజు, లక్ష్మణ్‌, శిరీష్‌, ఛోటా కె. నాయుడు, పైడిపల్లి వంశీ, ఎన్టీఆర్‌, కాజల్‌, ఆహుతి ప్రసాద్‌, తమన్‌, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాజమౌళి, వి.వి.వినాయక్‌ ల చేతులమీదుగా చీఫ్‌ కోడైరెక్టర్‌ సోమనాథ్‌, కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడు, మాటల రచయిత కొరటాల శి, ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, దర్శకుడు పైడిపల్లి వంశీ, హీరోయిన్‌ కాజల్‌, రఘుబాబు, ఆహుతి ప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, కథానాయకుడు ఎన్‌.టి.ఆర్‌.లు ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌లు అందుకున్నారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఇంతకు ముందే చెప్పాను మళ్లీ ఇప్పుడ చెబుతున్నాను, ఈ సంవత్సరంలో టాప్ త్రీ హిట్స్ లో 'బృందావనం" ఒకటన్నారు. అలాగే అర్థశతదినోత్సవాన్ని నిజామాబాద్ లో జరుపుటకు ప్లాన్ చేస్తున్నామన్నారు. తర్వాత జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ చిత్రం తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్, అలాగే నందమూరి ఫ్యాన్స్ ఇలాంటి యూత్ మరియు ఫ్యామిలి ఎంటర్ టైన్ మెంట్ మూవీసే చేయాలాని చెప్తున్నారు. అభిమానుల ఆశీర్వాదాలుంటే తప్పకుండా చేస్తాన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu