twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి కష్టాల్లో జక్కన కుటుంబమే అండగా.. తండ్రి మరణాన్ని గుర్తు చేసుకొని.. ఎన్టీఆర్ భావోద్వేగం

    |

    తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా మారారు. అభిమానుల కోలాహలంతో క్రేజీగా సాగిన ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకొన్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ...

    నా కుమారుల విషయంలో టెన్షన్

    నా కుమారుల విషయంలో టెన్షన్

    తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే చాలా తక్కువసార్లు ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే కాలభైరవ, సింహాను చూస్తుంటే నా కుమారులు అభయ్, భార్గవ గురించి మాట్లాడాల్సి వస్తే ఎంత టెన్షన్ ఉంటుందో.. ఈ రోజు కూడా అలానే ఉంది. కాలభైరవ, సింహా సాధించిన విజయాలను అంతే సంబరపడుతాననే ఫీలింగ్ కలుగుతుంది అని ఎన్టీఆర్ అన్నారు.

    దేవుడు ఇచ్చిన శక్తి అభిమానులే

    దేవుడు ఇచ్చిన శక్తి అభిమానులే

    నా జీవితంలో నాకు దేవుడు ఇచ్చిన శక్తి అభిమానులు అయితే, మరో నాకు దేవుడు ఇచ్చిన, తెలిసిన ఒకే కుటుంబం కీరవాణి, రాజమౌళి ఫ్యామిలీ. నా మంచి చెడుల్లో, సుఖ:దుఖాల్లో నేను తీసుకొన్న నిర్ణయాల్లో పరోక్షంగాను, ప్రత్యక్షంగాను నా వెనుక ఉన్న కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం అని ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

    జక్కన్న ఫ్యామిలీకి చీఫ్ గెస్ట్‌ను కాను

    జక్కన్న ఫ్యామిలీకి చీఫ్ గెస్ట్‌ను కాను

    నాకు ఎంతో ఇష్టమైన జక్కన్న, కీరవాణి కుటుంబ కోసం వచ్చానే తప్ప.. నేను చీఫ్ గెస్ట్‌గా రాలేదు. వారి కుటుంబానికి నేను చీఫ్ గెస్ట్ కాదు. ఎప్పటికీ కాబోను.. కాలేను అని అన్నారు. నన్ను ఈ వేదిక మీద చీఫ్ గెస్ట్ అని, మరోటి అని అనడం సరికాదు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

    నాన్నతో సాయి కొర్రపాటి అనుబంధం

    నాన్నతో సాయి కొర్రపాటి అనుబంధం

    నిర్మాత సాయి కొర్రపాటి గురించి మాట్లాడుతుండగా తన తండ్రి హరికృష్ణను తలచుకొని ఎమోషనల్ అయ్యారు. మా సాయన్నతో నాకు 30 ఏళ్ల పరిచయం. నాన్నతో సన్నిహితంగా ఉండేవారు. నాన్న మరణించినంత వరకు సాయన్న కలిసి ఉన్నాడు. సాయన్న నా సొంత మనిషి. ఆయన గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

    సినిమాకు మంచి సక్సెస్ లభించాలి

    సినిమాకు మంచి సక్సెస్ లభించాలి

    తెల్లవారితే గురువారం సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. దర్శకుడు మణికాంత్‌ బాగా తీశారనే విషయం తెలిసింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి మంచి సక్సెస్ లభించాలని కోరుకొంటున్నాను. ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

    English summary
    Thellavarithe Guruvaram is an film directed by Manikanth Gelli and jointly produced by Rajani Korrapati and Ravindra Benerjee Muppaneni under the banners of Vaaraahi Chalana Chitram and Loukya Entertainments. The film features Sri Simha, Chitra Shukla and Misha Narang in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X