»   » ఎన్టీఆర్ నిశ్చితార్థం విశేషాలు.. లక్ష్మీ పార్వతకి షాక్..

ఎన్టీఆర్ నిశ్చితార్థం విశేషాలు.. లక్ష్మీ పార్వతకి షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ఎంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో వివాహ నిశ్చితార్థం నేడు హైదరాబాదులోని నార్నె స్వగృహంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సన్నిహితులు, మరి కొంత మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆయన మామగారు కోట్లు ఖరీదు చేసే ఆడీ కారును బహోకరించాడని సమాచారం. ఇదే కారులో ఎన్టీఆర్ మామగారి ఇంటికి తరలివెళ్లాడట. ఈ నిశ్చితార్థం సందర్భంగా ఈ నూతన జంట ఉంగరాలు మార్చుకున్నారట. ఎన్టీఆర్ తన కాబోయే భార్యామణికి సుమారు కోటి రూపాయలు విలువచేసే వజ్రపుటుంగరాన్ని తొలిగాడట.

మే 9న వివాహ తేదీగా నిశ్చయించారు. ఇక ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సన్నిహితులందరినీ ఆహ్వానించి..ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతిని పిలవకుండా ఆమెకు షాక్ ఇచ్చారు. ఏ విశేషం జరిగినా మీడియాకెళ్లి మాట్లాడటం అలవాటున్న లక్ష్మీ పార్వతి వెంటనే ఓ ఫ్రయివేటు న్యూస్ ఛానెల్ కు వెళ్లి తన బాధను వ్యక్తపరిచింది. జూ ఎన్టీఆర్, అతని తల్లిని ఎవ్వరూ పట్టించుకోనప్పుడు నేనే వారి ఆలనాపాలనా చూసాను. అలాంటి నాకే ఆహ్వానం అందకపోవడం నన్ను షాక్ కు గురిచేసింది. అయినా బుడ్డోడికి నా ఆశ్వీర్వాదాలు ఎప్పుడూ వుంటాయి అని తన ఔదార్యాన్ని చాటుకుంది. ఇక నన్ను పిలవటం, పిలవకుండటం వారి ఇష్టం..అయినా నన్ను ఈ వేడుకకు విలవడం మహామనిషి ఎన్టీఆర్ ను అవమానించినట్టే అని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకను మొదటి నుండీ చివరి వరకూ చంద్రబాబు నాయుడు దగ్గరుండి నడిపించడం హైలెట్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu