»   » బృందావనం: జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఫెయిలయ్యారు?

బృందావనం: జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఫెయిలయ్యారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో జూనియర్ ఎన్టీఆర్ రీల్ లైఫ్ లో విజయం సాధించినా రియల్ లైఫ్ లో ఓ విషయంలో మాత్రం విఫలమయ్యారు. దిల్ రాజు ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాలో రెండు కుటుంబాలను ఏకం చేయడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. కానీ, నిజ జీవితంలో ఆ పని చేయలేకపోయారు. ఆయన తన మామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబాన్ని, కేంద్ర మంత్రి, అత్త దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబాన్ని మాత్రం కలపలేకపోయారు. బృందావనం స్పెషల్ షో చూడడానికి చంద్రబాబు, పురంధేశ్వరి వచ్చారు. కానీ వారిద్దరు కలిసిపోలేకపోయారు. నమస్తే, ఎలా ఉన్నారని ముక్తసరిగా పలకరించుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. షో ముగిసే వరకు ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత ఇద్దరు చాలా సేపు నిరీక్షించారు. ఇద్దరికి కూడా అది ఎంతో ఇబ్బందిగానే ఉండి ఉంటుంది. అయితే, పురంధేశ్వరి తొలుత అక్కడి నుంచి కదిలారు. దీంతో చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. ఒకే కుటుంబానికి చెందినా పురంధేశ్వరికి, చంద్రబాబుకు మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu