»   » జూ ఎన్టీఆర్ కారుకి ఆ ఫ్యాన్సీ నెంబర్

జూ ఎన్టీఆర్ కారుకి ఆ ఫ్యాన్సీ నెంబర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ తాజాగా రవాణా శాఖ నిర్వహించిన 'ఎ.పి.09 డబ్ల్యూఎక్స్‌' సిరీస్‌ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో '9999' నెంబర్ ను దక్కించుకున్నారు. ఎన్టీఆర్ కొత్త బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నెంబరు తీసుకున్నారు. ఈ నెంబర్ కోసం ఆయన ఐదు లక్షలు చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ చాలా సంతోషకరంగా ప్రకటన చేసింది. అందులోనూ ఆర్ధిక మాద్యం దెబ్బతో ఫ్యాన్సీ నెంబర్ల పై ఆసక్తి సన్నగిల్లిందని అయితే ఈ వేలం ఆశాజనకంగా ఉందని రవాణా శాఖ అధికారి వ్యాఖ్యా నించారు. ఇక ఈ వేలంలో ఒకటో నెంబరు రూ.3 లక్షలు, 9 నెంబరు రూ.66 వేలు, 99 నెంబరు రూ.12 వేలు పలికాయి. టోటల్ గా రవాణా శాఖకు రూ.13 లక్షల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్...శక్తి, బృందావనం చిత్రాలు చేస్తున్నారు. శక్తి చిత్రాన్ని మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తూండగా అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బృందావనం చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూండగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu