For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూ. ఎన్టీఆర్ లుక్, 'టెంపర్‌' పై వర్మ కామెంట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఇటీవల గోవాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమాకి 'టెంపర్‌' అన్న పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే పేరుతో కూడిన ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తారు. బుధవారం ముందస్తుగా ఎన్టీఆర్‌ ప్రచార చిత్రాలు కొన్ని బయటికొచ్చాయి. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో సందడిగా ఉండే రామ్ గోపాల్ వర్మ కొన్ని కామెంట్స్ చేసేసారు. అయితే పాజిటివ్ గానే సుమండి. ఆ కామెంట్స్ స్లైడ్ షోలో మీరు చదవచ్చు.

  ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫొటోలు అంతర్జాలంలో సందడి సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్‌ పోలీసు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, ఆలీ. పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయ ప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, పవిత్ర వంటి స్టార్‌ కాస్టింగ్‌ అంతా నటించడం కూడా ఈ సినిమాకి మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు

  ఎన్టీఆర్ గురించి వర్మ ట్వీట్లు స్లైడ్ షోలో... చదవండి

  వర్మ ట్వీట్ చేస్తూ...

  వర్మ ట్వీట్ చేస్తూ...

  "ఇప్పుడే "టెంపర్" లోని కొన్ని సన్నివేశాలు చూడటం జరిగింది. తారక్ సింపుల్ గా అవుట్ స్టాండింగ్...ఇప్పటిదాగా జగన్ క్రియేట్ చేసిన బెస్ట్ హీరో క్యారెక్టర్ ఇదే అనుకుంటున్నాను ."

  వర్మ ట్వీట్ కంటిన్యూ చేస్తూ...

  వర్మ ట్వీట్ కంటిన్యూ చేస్తూ...

  "తారక్ ని ఉన్నత స్ధాయిలోకి తీసుకువెళ్లే చిత్రం ఇది. టెంపర్ చిత్రం ఇప్పటిదకా జగన్ చేసిన కమర్షియల్ ఫిల్మ్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. అందులో సీన్స్, సాంగ్ లు, ఎంటర్టైన్మెంట్ అన్నీ...పీక్స్ లో ఉంటాయి. అన్నారు.

  అలాగే...

  అలాగే...

  టెంపర్ చిత్రం జ'గన్' నుంచి వచ్చిన బుల్లెట్. తారక్ జ'గన్' నుంచి వెలువడిన బుల్లెట్ లా ఈ చిత్రంలో కనపడతాడు. యాంటి ఎయిర్ క్రాప్ట్ టాంక్ నుంచి విడిచిన మిస్సైల్ కన్నా పవర్ ఫుల్ గా ఈ బుల్లెట్ ఉంటుంది.

  అంతేకాదు..

  అంతేకాదు..

  తారక్ ...టెంపర్" తో పోలిస్తే... "పోకిరి" మరియు "బిజినెస్ మ్యాన్ " లు ఫ్లాఫ్ లు క్రిందే లెక్క." అని ఆకాసానికి ఎత్తేసారు.

  వర్మ కంటిన్యూ చేస్తూ...

  వర్మ కంటిన్యూ చేస్తూ...

  "టెంపర్ గురించి నా ట్వీట్ లు అన్నీ చదివి మీరంతా నేను తారక్ తో సినిమా చేయటానికే అనుకుంటున్నారేమో...నాకు జగన్ కు ఉన్నంత కెపాసిటీ లేదు...తారక్ తో టెంపర్ చేసినంతలా నేను చేయలేను.

  అర్దమయ్యింది...

  అర్దమయ్యింది...

  వర్మ ఇంకా చెప్తూ....టెంపర్ లో తారక్ ఫెరఫార్మన్స్ చూసిన తర్వాత నాకు అర్దమయ్యింది...తనతో సినిమా చేసే అర్హత నాకు లేదు...తెలియదు." అన్నారు.

  అదంతా ఆమె పనే...

  అదంతా ఆమె పనే...

  ‘టెంపర్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీనికి కారణం ఎవరో తెలుసా..ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ భార్య పోని వర్మ. షూటింగ్‌ స్పాట్‌లో ఎన్టీఆర్‌ ఫోటోని ఆమె నెట్‌లో పోస్ట్‌ చేయడంతో అభిమానులు ఆనందంతో చిందులేస్తున్నారు. అంతేకాకుండా ఎడిటింగ్‌ రూమ్‌ నుంచే ఈ ఫోటోలను పెడుతున్నట్లు ట్వీట్‌ చేసింది.

  అదిరిపోయింది...

  అదిరిపోయింది...

  ఏది ఏమైనా.. చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

  అదే రిపీట్..

  అదే రిపీట్..

  పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది. ఈ సినిమాకి బండ్ల గణేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

  స్టైలిష్ గా...

  స్టైలిష్ గా...

  లీక్ అయిన ఫోటోలలో రెండు ఫోటోలలో ఎన్.టి.ఆర్ స్టైలిష్ హెయిర్ స్టైల్ తో లుక్ డిఫరెంట్ గా ఉంటే ఒక ఫోటోలో మాత్రం బేర్ బాడీతో 6 ప్యాక్ లుక్ లో ఉన్నాడు.

  రెస్పాన్స్ అదుర్స్..

  రెస్పాన్స్ అదుర్స్..

  ఈ ఫొటోలకి సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ ఫోటోలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చాలా కాలం క్రితం లావుగా ఉన్న ఎన్.టి.ఆర్ కాస్తా స్లిమ్ లుక్ లోకి వచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

  గుంటూరులోనే...

  గుంటూరులోనే...

  ‘టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. త్వరలోనే ఆడియో విడుదల డేట్ ప్రకటించి ఈ విషయమై అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Ram Gopal Varma wrote on his micro-blogging page, "Saw some scenes of "Temper" ..Tarak is simply outstaaaanding...I think it's the best hero character jagan ever created." "Temper I think is the most commercial film ever made by Jagan be it songs scenes entertainment nd above all like a high mountain is TARAK. I think jagan after "Temper" will be known as Ja'gun' and Tarak is his bullet. Tarak as a bullet in "Temper" fired from Ja'Gun' is more powerful than a Missile fired from an Anti Aircraft Tank. Compared to Tarak's Temper" "Pokiri" and "Businessman" seem like flops."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X