»   » తమిళంలోనూ గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు... ఒకటీ.. రెండూ.. కాదు ఒకేసారి 100

తమిళంలోనూ గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు... ఒకటీ.. రెండూ.. కాదు ఒకేసారి 100

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరోలు, తమిళ సినిమలూ తెలుగులో భారీ విజయాలను సొంతం చేసుకోవటం మనకు కొత్తేం కాదు. అప్పటి రజినీ కాంత్ దగ్గరినించీ ఇప్పటి విశాల్ వరకూ చాలా మంది హీరోలకి ఇక్కడ సొంత మార్కెట్ ఉంది. ఇక సూర్య, విక్రమ్, కార్తీ లాంటి సినిమాలైతే మన స్టార్ హీరోలతో సమానం గానే మార్కెట్ విలువ కలిగి ఉన్నారు. కొన్నిసార్లైతే తమిళ సినిమాల వల్ల మన స్ట్రైట్ సినిమాలే దేబ్బతింటున్నాయి.

ఇలా తమిళ ఇండస్ట్రీ దశాబ్దాలుగా మన మార్కెట్‌ను కొల్లగొట్టేస్తుంటే. ఇన్నాళ్ళూ ఊరుకున్నారు గానీ ఈ విషయం లో మనవాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త యాక్టివ్ అవుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టిపెడుతున్నారు మన హీరోలు. ఈ విషయం లో అల్లు అర్జున్ మళయాలం లో ఎప్పుడో జండా పాతేసాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో మల్లు ఇండస్ట్రీ వైపి అడుగులు వేశాడు.


Jr NTR Janatha Garage To Release In Three Languages

మళయాలం వరకూ ఓకే నే గానీ తమిళం సంగతేమిటీ..? అసలే తెలుగు సినిమా అంటే నిన్నా మొన్నటి వరకూ చిన్న చూపు ఉన్న అరవ ప్రేక్షకులు కూడా బాహుబలి లాంటి సినిమాలతో తెల్గు సినిమా వైపు చూపు తిప్పుతున్నారు. ఈ సమయం లొనే మన సినిమాలనూ అక్కడ రిలీజ్ చేసి నెమ్మదిగా అక్కడ కూడా మార్కెట్ పెంచాలనే ప్రయత్నాల్లో పడ్డారు మనోళ్ళు. ఐతే ఏ సినిమా పడితే ఆ సినిమాను వేరే భాషల్లోకి తీసుకెళ్తే ప్రయోజనం ఉండదు. నేటివిటీ, స్టార్ వేల్యూ అన్నీ ఉండాలి. ఇప్పుడు అలా అన్నీ కుదిరిన సినిమా జనతా గ్యారేజ్.


ఈ సినిమాను మలయాళం.. తమిళ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయటానికి ఇదే మంచి అవకాసం. ఇక్కడ తమిళ ప్రేక్షకుల కి దగ్గరవ్వటం లో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించాడు, అంతే కాదు సమంతా, నిత్యా మీనన్ కూడా అక్కడ మంచి ఫాలోయింగ్ తోనే ఉన్నారు. మోహన్ లాల్ కిమలయాళంతో పాటు తమిళంలోనూ చెప్పుకోదగ్గ ఫ్యాన్సే ఉన్నారు. అలాగే సమంత, నిత్యామీనన్ కూడా అక్కడ పాపులరే. ఇక కొరటాల శివ లాస్ట్ మూవీ "శ్రీమంతుడు" కూడా తమిళంలో రిలీజ్ అయ్యి ఓ మోస్తరుగా ఆడింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.


అందుకే మలయాళం తో పాటే తమిళంలోనూ "జనతా గ్యారేజ్" ని భారీగానే రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట వందకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది. బాహుబలిని మినహాయిస్తే మరే తెలుగు సినిమా నీ ఇప్పటి వరకూ ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేయలేదు. జూనియర్ సినిమాకి మన దగ్గర వంద థియేటర్లంటే చిన్న విషయం కానీ. అసలే తక్కువ థియేటర్లుండే తమిళనాడులో.., అదీ ఒక పరభాషా చిత్రానికి అది చిన్న విష్యమేం కాదు. సినిమాకు పాజిటివ్ టాక్ గనక వస్తే తమిళంలో తారక్‌కు మంచి మార్కెట్ రావటమే కాదు. తెలుగు నటులకి కూడా తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే మార్గం ఏర్పడుతుంది. చూడాలి మరి ఏమౌతుందో....

English summary
JanathaGarage Tamil Nadu release confirmed Offered for superb price
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu