»   » ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, క్రిష్ (ఫోటోస్)

ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, క్రిష్ (ఫోటోస్)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Nandamuri Family Members Pay Tributes To Sr NTR On His 95th Birth Anniversary

  మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు 95వ జయంతి పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్ అభిమానుల తాకిడితో సందడిగా మారింది. అభిమానులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘాట్‌ను సందర్శించి ఎన్టీ రామారావును స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ తన ఇద్దరు కొడుకులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కలిసి ఘాట్‌ను సందర్శించారు.

  రాష్ట్రానికి ఈ రోజు పండగ రోజు

  రాష్ట్రానికి ఈ రోజు పండగ రోజు

  ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ రోజు అన్నగారి 95వ పుట్టినరోజు, ఆంధ్రరాష్ట్రానికి ఒక పండగ రోజు. ప్రతి ఇంట ఒక బిడ్డకావాలి, ఆ బిడ్డ ఒక రామారావు లాగా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఆయనంతటి మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకునే పర్వదినం నేడు. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే తరాలు చాలవు, యుగాలు చాలవు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బావుండాలి, ఇరు ప్రాంతాల వారు బావుండాలి, సుఖంతా బ్రతకాలి, పేద బడుగు బలహీన వర్గాల వారు బావుండాలని కోరుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్'' అన్నారు.

  పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ చరిత్రను చేర్చాలి

  పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ చరిత్రను చేర్చాలి

  మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరి జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో ఉన్నాయి. అలాగే తెలుగు జాతికై పోరాడిన నందమూరి తారకరామరావు జీవితంలో ముఖ్య ఘట్టాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.... అని హరికృష్ణ వెల్లడించారు.

  భారీ సంఖ్యలో అభిమానులు

  భారీ సంఖ్యలో అభిమానులు

  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  ఎన్టీఆర్ ఫ్యామిలీ

  ఎన్టీఆర్ ఫ్యామిలీ

  ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన దాదాపు అందరూ ఘాట్‌ను సందర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

  నాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా: దర్శకుడు క్రిష్

  నాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా: దర్శకుడు క్రిష్

  ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్, రచయిత సాయి మాధవ్ బుర్రా ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప జేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, అందరికీ అన్న నందమూరి తారకర రామారావు సినిమాలు చూస్తూ పెరిగిన నేను, ఆయన జీవిత చరిత్రను చలన చిత్ర రూపంలో జాతి మొత్తానికి అందించే సదవకాశాన్ని, మహా భాగ్యాన్ని నాకు కలగజేసిన నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నగారి జయంతి రోజున ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను. హ్యూమన్ ఫినామినా చాలా తక్కువ మంది వ్యక్తుల్లో చూస్తాం. అలాంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను' అన్నారు.

  English summary
  NTR Jr and Kalyan Ram made quite a sight, as they walked in hand in hand accompanied by dad Harikrishna and family members at the NTR Ghat, early on Wednesday morning to pay their respects to the late NTR, on the occasion of the matinee idols 95th birth anniversary.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more