twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కి బాలకృష్ణ సూచనలు

    By Staff
    |

    Balakrishna-Jr Ntr
    ఎన్టీఆర్ రోడ్ షో ఈ నెల 12 వ తేదీనుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తన బాబాయ్ బాలకృష్ణతో ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల ఎనిమిది నుంచి బాలయ్య నెల్లూరు జిల్లా తడ నుంచి రెండో విడత పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో తొలి విడత పర్యటన జరిపిన బాలకృష్ణ తన అనుభవాలను వివరించినట్లు సమాచారం. సినీ నటులు ప్రచారంలో పాల్గొంటే చూసేందుకు ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వారి అభిమానాన్ని తట్టుకుని ఓపికతో పర్యటన కొనసాగించాలని, పార్టీ నాయకులు, అభిమానసంఘాల వారి మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని బాలకృష్ణ చెప్పారని తెలుస్తోంది.

    జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్‌ షో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్‌ షోను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణ, బాలకృష్ణ, మోహనకృష్ణ తదితరులంతా హాజరవుతారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో తాత పుట్టిన ఊరు నిమ్మకూరు వెళ్తారు.

    అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అక్కణ్నుంచి శ్రీకాకుళం వెళ్లి రోడ్‌ షోలకు శ్రీకారం చుడతారు. రోడ్‌ షోల్లో ఆకట్టుకునే రీతిలో ప్రసంగించేందుకుగాను జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మొత్తం నెలరోజుల పాటు అవిశ్రాంతంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్‌ షో జరగనుంది. ఈ సందర్భాగా నందమూరి నటవారసులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలవనున్నారు. ఇలా జరగడం ఇదే ప్రథమనని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పర్యటనపై పార్టీ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X