twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్ గెస్ట్ పాత్ర విషయమై మంచు విష్ణు

    By Srikanya
    |

    హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ తాజాగా మంచు విష్ణు చిత్రం దేనికైనా రెడీలో గెస్ట్ గా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియావారు మంచు విష్ణుని కలవటం జరిగింది. ఆయన మాట్లాడుతూ...అది నిజం కాదు. ఎక్కడ నుంచి ఈ న్యూస్ పుట్టిందో తెలియటం లేదు. అసలు అలాంటి ఆలోచనే మాకు లేదు. తమకు ఎలాంటి కోరిక ఉందో అదే వెబ్ సైట్స్ వారు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. దాన్ని టీవీ ఛానెల్స్ పికప్ చేస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నాయో అర్దం కావటం లేదు అన్నారు.

    మరో ప్రక్కి ఈ చిత్రం సెన్సార్ వివాదంలో ఇరుక్కుంది. 'దేనికైనా రెడీ' సినిమాను శుక్రవారం సెన్సార్‌ సభ్యులకు చూపించారు. వారు ఎనిమిది కత్తిరింపులతో యు/ఎ సర్టిఫికెట్‌ అర్హమైనదిగా నిర్ణయించారు. సోమవారం అందుకు సంబంధించిన ధ్రువపత్రం ఇచ్చే ముందు మరో ఇరవై కత్తిరింపులు చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో చిత్ర నిర్మాత మోహన్‌బాబు రివిజన్‌ కమిటీకి చిత్రాన్ని చూపించేందుకు సన్నద్ధమవుతున్నారు. సెన్సార్‌వాళ్ల ధోరణి మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు ఉందని విష్ణు ఆరోపించారు.

    విష్ణు మీడియాతో మాట్లాడుతూ ''శుక్రవారం చూపించినప్పుడు, ప్రచార చిత్రాలప్పుడూ లేని అభ్యంతరాలు సోమవారం ఎందుకు పుట్టుకొచ్చాయో అర్థం కావట్లేదు. విడుదల దగ్గరపడ్డ సమయంలో ఇలా కొత్త కట్స్‌ చెప్పడం ఇబ్బందికరమైన చర్య. తొలుత చూసిన సభ్యులు వేరు... ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తిన సభ్యులు వేరు. ఎవరెవరికో సెన్సార్‌ అధికారి సినిమాను చూపిస్తున్నారేమో అనే అనుమానం వస్తోంది. నేను మలయాళం వెర్షన్‌కి దరఖాస్తు చేయక ముందే దాన్ని సెన్సార్‌వాళ్లు చూడటం భావ్యం కాదు. మంగళవారం రివిజన్‌ కమిటీకి దరఖాస్తు చేసి చూపిస్తామ'' అన్నారు

    ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

    English summary
    
 Vishnu said...' NTR not in our Denikaina Ready film. I don't know where people pick up such news, but that was never even proposed. With the advent of WWW, people have been writing whatever they wish to. And, the TV channels pick it up too"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X