»   » జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ దసరాకి ఖరారైనట్టే...!

జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ దసరాకి ఖరారైనట్టే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊసరవెల్లి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఇక పొతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో వచ్చే దసరా పండగ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఆ విడుదల తేదిని ఖరారు చేశారని వినికిడి.

ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఈ రోజు నుండి నానక్ రామ్ గూడా, రామానాయుడు స్టుడియోలో జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తో ఈ చిత్రం 60 శాతం పూర్తయిందని తెలుస్తుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

'బద్రినాథ్" సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న తమన్నా..తన తదుపరి చిత్రాల గురించి చెబుతూ 'ఎన్టీఆర్ తో ఊసరవెల్లి" తోనూ 'రామ్ చరణ్ తో 'రచ్చ" చిత్రాలు చేస్తున్నాని చెబుతోంది. ముఖ్యంగా రామ్ సినిమా కోసం అనుకున్న 'ఊసరవెల్లి" అనే టైటిల్ ను ఎన్టీఆర్ సినిమాకు ఎందుకు పెడతారు అని అభిమానుల్లో చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఇవేవీ తెలియని తమన్నా ప్రస్తుతం తాను ఎన్టీఆర్ తో 'ఊసరవెల్లి" అనే సినిమాలో నటిస్తున్నానని తేల్చి చెబుతుండడంతో, సమయానుకూలంగా రంగులు మార్చుతుండే.. 'ఊసరవెల్లి" అనే జంతువు పేరు ఎన్టీఆర్ చిత్రానికి టైటిల్ గా మారిపోయిందని తెలుస్తోంది.

English summary
Young Tiger Ntr is acting in the film oosaravelli under the direction of Surender Reddy and the movie is shooting at Hyderabad as of now, the movie is expected to be released on 23rd of September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu