»   » కొత్త గెటప్ లో జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ ఫస్ట్ లుక్...!

కొత్త గెటప్ లో జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ ఫస్ట్ లుక్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ కి తన గెటప్స్ తో, లుక్స్ తో ఎక్స్ పెరిమెంట్ చేసే హిస్టరీ లేదు కేవలం బరవు పెరగడం, తగ్గడం మినహా ఇన్నేళ్లలో అతను లుక్ పరంగా పెద్దగా ప్రయోగాలు చేయలేదు. అయితే ఊసరవెల్లి సినిమాలో మాత్రం ఎన్టీఆర్ కొన్ని చిత్రమైన గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. కథానుసారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ భిన్నమైన గెటప్స్ వేస్తున్నాడట. ఒక్కో సందర్భంలో ఒక్కోలా..ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చే ఈ పాత్రకి దర్శకుడు సురేందర్ రెడ్డి వివిధ గెటప్స్ డిజైన్ చేశాడట. అందుకే ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ఏమీ ఇంతదాకా విడుదల చేయలేదు.

జూ ఎన్టీఆర్ లుక్స్ అన్నీ సర్ ఫ్రైజ్ గా ఉంచి, సినిమా విడుదలకి ముందు ఇంట్రెస్ట్ లెవల్స్ పెంచడానికి ఒక్కొక్కటీ రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఓ స్టిల్ బయటకి వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ డైడ్ హెయిర్ తో, డిఫరెంట్ కాస్టూమ్స్ తో భిన్నంగా కనిపిస్తున్నాడు. అయితే ఈ గెటప్ లో చెప్పుకోతగ్గ ప్రత్యేకతలేమీ లేవు. ఇది కాకుండా దాచి పెట్టిన ఎన్టీఆర్ గెటప్స్ ఇంకా చాలానే ఉన్నాయి కనుక ఇది లీకయినా ఊసరవెల్లికి పెద్దగా నష్టమేం ఉండకపోవచ్చు.

ప్రస్తుతం ఊసరవెల్లి" షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ప్రస్తుతం బ్యాంకాక్ లో సినిమాలో ఇంపార్టెంట్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని ఈ దసరాకి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చెయ్యాలనే పట్టుదలతో ఎన్టీఆర్ బ్రేక్ తీకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో మరో అద్భుతమైన ఆడియో రానుందని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అంటున్నారు. జూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి"తో పెద్ద హిట్ కొట్టబోతున్నానన్న కాన్ఫిడెన్స్ తో వున్నాడు.

English summary
Oosaravelli Starring Jr Ntr And Tamannah Directed By Surender Reddy Produced By B V N S Prasad and Music Composed By Devi Sri Prasad. Jr NTR's Oosaravelli first look to be unveiled officially by the production unit in recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu