»   » సాక్ష్యం ఇదిగో:ఎన్టీఆర్ ఏటిట్యూ్డ్,బిహేవియర్ గురించే

సాక్ష్యం ఇదిగో:ఎన్టీఆర్ ఏటిట్యూ్డ్,బిహేవియర్ గురించే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిని వర్గాల్లో ఎక్కడ విన్నా బాహుబలితో పాటు...మరో విషయమై చర్చ నడుస్తోంది. అది మరేదో కాదు..ఎన్టీఆర్ గురించి. ముఖ్యంగా సుకుమార్ చిత్రం కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఓ అభిమాని ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అసలేం జరిగిందంటే..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రీసెంట్ గా సుకుమార్ చిత్రం కోసం యూరప్ లో షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ని ఓ అభిమాని కలవటం జరిగింది. అతను ఎన్టీఆర్ కూల్ యాటిట్యూడ్ ని చూసి ఆశ్చర్యపోయి ఈ విషయమై ఆయనతో దిగిన ఫోటోతో కలిపి ఫేస్ బుక్, ట్విట్టర్ లో వదిలాడు. అంతే తుఫాన్ మొదలైంది.ఎన్టీఆర్ అభిమానులు దాన్ని షేర్ చేయటం మొదలెట్టారు. క్రింద ఉన్న ఆ ఫోటోని మీరూ చూడండి.

ఇంతకీ ఆ ప్యాన్ ఏమన్నాడంటే...తాను లండన్ వీధుల్లో ఎన్టీఆర్ ని చూసి చాలా ఉద్వేగానికి గురి అయ్యానని అన్నారు. అంతేకాదు వెంటనే ఆయన్ను కలవటానికి వెళ్లి ఫొటో తీయించుకుంటానని అన్నానని అన్నారు. అప్పుడు రాజు సుందరం,సుకుమార్ లతో అప్పుడు చేయబోయే డాన్స్ గురించి డిస్కక్ చేస్తున్నారని ,ఓ పదిహేను నిముషాలు ఆగమని, ఆ తర్వాత వచ్చి ఫోటో దిగారని అన్నారు. ఇంతకీ ఇంకేం అన్నాడో క్రింద ఫోటోలో చూడండి.

Jr NTR's Attitude And Behaviour In Discussion

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
A fan mentioned, NTR's dedication towards his work as well as his love towards fans impressed every one.
Please Wait while comments are loading...