»   » ఎన్టీఆర్ హోవర్ బోర్డ్ ప్రాక్టీస్ (వీడియో)

ఎన్టీఆర్ హోవర్ బోర్డ్ ప్రాక్టీస్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఏది చేసినా పూర్తి స్ధాయి ఫెరఫెక్షన్ తో చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన నిరంతరం పరితపిస్తూనే ఉంటారు. రీసెంట్ గా ఆయన తన తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' కోసం హోవర్ బోర్డ్ ని ప్రాక్టీస్ చేసారు. ఈ మేరకు నిర్మాతలు మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఇదిగో ఆయన కష్టాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు.


అలాగే... ఇప్పటికే ఈ సినిమాలోకి పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ స్వయంగా పాడిన ' ఐ వానా ఫాలో ఫాలో యు... ' అంటూ సాగే సాంగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ పాట ఎన్టీఆర్ పాడుతున్నప్పుడు...చాలా ఉత్సాహంగా నిర్మాత, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందరూ కలిసి డాన్స్ చేస్తూ పాడారు.ఇందుకు సంభందించిన మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఈ వీడియోలో నిర్మాత కూడా చాలా హుషారుగా స్టెప్పులేసారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. అందుకోసమే చాలా కసిగా చేసాడు ఈ సినిమాను.


Jr. NTR's hoverboard practice!

ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన. నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే.


ఈ సినిమాలో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది'' అని చెప్పుకొచ్చారు.


English summary
Jr NTR Proves his passion for movies once again with hoverboard practice in the making of Nannaku Prematho. Nannaku Prematho is an upcoming movie directed by Sukumar and produced by BVSN Prasad.
Please Wait while comments are loading...