Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనతా గ్యారేజ్: ఒకరోజు ముందే రిలీజవుతోంది (న్యూ పోస్టర్స్)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సోమవారం తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తం గా సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో విడుదల అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో విడుదల కు సిద్ధం అవుతోంది.
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ :
"చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ యూనిట్ తో పని చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మా నిర్మాతలు సిద్ధ పడుతున్నారు", అని తెలిపారు.

రిలీజ్ డేట్ పోస్టర్
జనతాగ్యారేజ్ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ :
" యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మించాం . భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో ప్రపంచవ్యాప్తం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మా బ్యానర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలుస్తుంది అని అనుకుంటున్నాం" అని తెలిపారు.

ఇతర తారాగణం
సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

తెర వెనక
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.