»   » ఫేస్ బుక్ లో దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ...రేర్ వీడియో

ఫేస్ బుక్ లో దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ...రేర్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుకుమార్ దర్సకత్వంలో రూపొందిన నాన్నకు ప్రేమతో చిత్రం మంచి హిట్ అయినప్పటినుంచీ ఎన్టీఆర్ క్రేజ్ రెట్టింపు అయ్యింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హవా బాగా వీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హీరోకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

తాజాగా ఈ హీరోకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఫేస్ బుక్ లో దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్ 15 ఏళ్ళ వయసులో వున్నప్పుడు తాను చేసిన కూచిపూడి దాన్స్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియో అది.

తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)

వాస్తవానికి ..ఎన్టీఆర్ మంచి క్లాసికల్ దాన్సర్ అన్న సంగతి తెలుసు. కానీ. ఈ మధ్య ఈ హీరో క్లాసికల్ దాన్సు పెర్ఫార్మన్స్ ఇచ్చిన సందర్థాలు లేవు. ఇండస్త్రీలో ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో చేశాడు కానీ. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ చేయలేదు.

పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)

అలాంటిది. ఈ హీరో చిన్ననాటి క్లాసికల్ దాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో లభ్యం కావడంతో అభిమానులు తెగ చూసేస్తున్నారు. ఆ రేర్ డన్న్సు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...

1997 Jr NTR Classical Dance Performance in Guntur

#RareVideo1997 Jr NTR Classical Dance Performance in Guntur ^_^- Nenu Naa NTR

Posted by Nenu Naa NTR on 25 November 2015

అంటే.. ఈ వీడియో 1997కి చెందింది. విశేషం ఏమిటంటే.. అప్పుడు ఎన్టీఆర్ దాదాపు 38 నిముషాలపాటు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజంగా ఇది గర్వించదగిన విషయం అనే చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో ఎన్టీఆర్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్లు చేస్తున్నారు. లైక్ల మీద లైక్లు కొడుతున్నారు.

English summary
Jr NTR's Unseen Classical Dance Performance Video From His Childhood.
Please Wait while comments are loading...