»   » ఎన్టీఆర్ ను 'శక్తి'వంతంగా చూపించడానికి సిద్ధం అవుతున్న నలగురు దర్శకులు..!!

ఎన్టీఆర్ ను 'శక్తి'వంతంగా చూపించడానికి సిద్ధం అవుతున్న నలగురు దర్శకులు..!!

Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కంత్రి సినిమా కాంబినేషన్ మరో సారి రిపీట్ అవుతోంది. కంత్రి సినిమాకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిసారి ఈ కాంబినేషన్ ఫ్లాప్ అయినా మరో సారి జతకట్టుతుండటం ఆశక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా గురించి మరో ఆశక్తికరమయిన విషయం ఏంటంటే ఈ సినిమాకు ఏకంగా నలుగురు దర్శకులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మెహర్ రమేష్ కాగా మిగిలిన వారు యండమూరి వీరేంద్రనాథ్, డియస్ కన్నణ్, జెకె భారవి.

ఇందులో యండమూరి ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాను తీసారు, అంతేకాకుండా రచయితగా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు. ఇక డియస్ కన్నణ్ అజయ్ హీరోగా రూపొందిన సారాయివీర్రాజు సినిమాను తీసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా దర్శకుడికి మంచి గుర్తింపు లభించింది. ఇక మూడవ వారు జెకె భారవి. ఈయన కొన్ని కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు చిత్రాలకు రచన చేసారు.

ఈ నలుగురిలో మెహర్ రమేష్ దర్శకుడు కాగా మిగిలిన ముగ్గురు రచనా సహకారం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూజాకార్యక్రమాలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ ఈ సినిమాకు టైమ్ లిమిట్, బడ్జెట్ లిమిట్ అంటూ ఎలాంటి నిబంధనలూ లేవు. అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాం తప్పక విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మాత్రమే చెయ్యగల కారెక్టర్ ఇది అన్నారు. సినిమా దాదాపు 90% ఇతర రాష్ట్రాల్లో తెరకెక్కిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ పూజా కార్య.క్రమంలో అల్లు అరవింద్ పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ సినిమాలో నాయికను ఇంకా ఎంపిక చెయ్యలేదు. తొలుత ఇలియానాను అనుకున్నా రెచ్చిపో, సలీం లాంటి సినిమాలతో ఫ్లాపుల్లో వున్న ఆమెను కాదని వరుస విజయాలతో దూసుకుపోతున్న కాజల్ ను తీసుకొనే అవకాశాలు మెండుగా వున్నా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu