»   » సోమ్మసిల్లుతోన్న జూ ఎన్టీఆర్ శక్తి...అభిమానుల్లో నిరుత్సాహం..

సోమ్మసిల్లుతోన్న జూ ఎన్టీఆర్ శక్తి...అభిమానుల్లో నిరుత్సాహం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ఇలియానా జంటగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న చిత్రం 'శక్తి". ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. గత వారంరోజులుగా అక్కడ ప్రత్యేకంగా వేసిన అమ్మవారి సెట్‌ లో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్‌ ప్రథమార్దంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

కాగా అప్పుడెప్పుడో బృందావనం సినిమాకు ముందు నుంచి మొదలైన సినిమా ఈ శక్తి. మెహర్ రమేష్ తీర్చి దిద్దుతూనే ఉన్నారు. జూ ఎన్టీఆర్ కూడా పాపం ఓపిగ్గా చేస్తూనే ఉన్నారు. అన్ని సక్రమంగా ఉంటే డిసెంబర్ లో ఆ సినిమా విడుదల కావాలి అన్నారు. ఆ తర్వాత సంక్రాంతికి అన్నారు. తాజాగా మంజరిని రెండో నాయికగా ఎంపికచేసుకున్నారు. అంటే కథా పరంగా గణనీయమైన మార్సులు జరిగినట్టే కదా లెక్క. అవన్నీ పక్కన పెడితే ఈ సినిమాను వేసవికి కానీ విడుదల చేయరట. ఇవన్నీ ఎన్టీఆర్ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu