»   » జైపూర్ లో జూ ఎన్టీఆర్ శక్తి!

జైపూర్ లో జూ ఎన్టీఆర్ శక్తి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'కంత్రి' చిత్రాన్ని అందించిన మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో 'శక్తి' తెరకెక్కుతోంది. 'సంక్రాంతికి 'అదుర్స్'తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో 'శక్తి' చిత్రం షూటింగ్ లో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఈ నెల 6 నుంచి రాజస్థాన్ లోని జైపూర్ లో కీలకమైన షెడ్యూల్ ను 300 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకోనుంది. 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఒక పాట, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రం గురించి హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, అశ్వనీదత్ గారి బ్యానర్ లో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ చెప్పారు. తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు జోడిగా అందాల ఖజానా ఇలియానా నటిస్తున్న ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, సిరివెన్నెల-రామజోగయ్య శాస్త్రి పాటలు, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu