»   » ఎన్టీఆర్ 'శక్తి' ఆడియో రిలీజ్,చిత్రం రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్

ఎన్టీఆర్ 'శక్తి' ఆడియో రిలీజ్,చిత్రం రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఈ సినిమా పేరుకు తగ్గట్టే ఎన్టీఆర్‌ శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టే చిత్రమిది. కథానుసారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కీలక ఘట్టాలు తెరకెక్కించాం. విదేశాల్లోని కొన్ని అరుదైన లొకేషన్లనూ తెరపై చూపిస్తున్నాం. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 27న పాటల్ని విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌ అభిమానులకే కాదు.. సినీ ప్రియులందరికీ నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ వేసవికి 'శక్తి'తో అందరినీ రంజింపజేస్తాం" అని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  శక్తి చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.అలాగే ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. మోహన్ బాబు చిత్రం చిట్టెమ్మ మొగడు తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే.

  ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

  English summary
  Jr Ntr’s Shakti movie is likely to release on 30th March. Music director Manisharma composed Audio of the movie and that will be release on 27th at Lalitha Kala Thoranam, Hyderabad. This socio fantasy flick is one of the highest budget movies of Telugu cinema with spending more then 45 crores. Bollywood actress Pooja Bedi playing a character of an Egyptian princess with super natural powers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more