»   » జూ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'శక్తి' విడుదల తేదీ

జూ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'శక్తి' విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న"శక్తి" చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.ప్రస్తుతం ఫైనల్ స్టేజస్ లో ఉన్న ఈ చిత్రం మార్చి 31వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. వైజయింతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పూజాబేడీ ఈజిప్టు మహారాణిగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను పోషిస్తోంది.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు అందుస్తున్నారు. ఆయన సమకూర్చిన ఆరు పాటల్లో ఇప్పటికే నాలుగు పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. జాకీష్రాప్, పూజాబేడి, సోనూ సూద్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu