For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ఇంట్లో శుభకార్యం: ఇప్పుడే చేయడానికి కారణం ఇదే.. కోవిడ్ తర్వాత తారక్ తొలిసారి అలా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనలోని ప్రత్యేకమైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిపోయాడు. ఈ క్రమంలోనే దాదాపు ఇరవై ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న తారక్.. తన ఇంట్లో శుభకార్యం నిర్వహించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని రహస్యంగా పూర్తి చేశాడట ఈ స్టార్ హీరో. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  వరుస హిట్లతో ఎన్టీఆర్ దూకుడు

  వరుస హిట్లతో ఎన్టీఆర్ దూకుడు

  యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్, హోస్టింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. టాలీవుడ్‌లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు ఎన్టీఆర్. ఆ మధ్య ఫ్లాపులను ఎదుర్కొన్న అతడు.. ‘టెంపర్' నుంచి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడ నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లు అందుకుని సత్తా చాటాడు.

  భారీ మూవీలో భాగమైన ఎన్టీఆర్

  భారీ మూవీలో భాగమైన ఎన్టీఆర్

  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు.

  ఫ్యూచర్ ప్లాన్ ఇలా... భారీ ప్లాన్లు

  ఫ్యూచర్ ప్లాన్ ఇలా... భారీ ప్లాన్లు

  ప్రస్తుతం RRRలో నటిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్.. దీని తర్వాత కొరటాల శివతో సినిమాను చేయబోతున్నాడు. దాని తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేస్తాడు. వీటికి సంబంధించిన ప్రకటన ఇటీవలే వెలువడింది. ఈ రెండు చిత్రాల తర్వాత నందమూరి హీరో బుచ్చిబాబు సనతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలేనని టాక్.

  బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు

  బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు

  అద్భుతమైన టాలెంట్‌తో చాలా కాలంగా సినిమాల్లో తన హవాను చూపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో ‘బిగ్ బాస్' షో కోసం హోస్టుగా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ అదరగొట్టిన ఈ స్టార్ హీరో.. సుదీర్ఘమైన విరామం తర్వాత ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.

  కరోనాతో పోరాడి గెలిచిన ఎన్టీఆర్

  కరోనాతో పోరాడి గెలిచిన ఎన్టీఆర్

  కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఇంట్లోనే ఉంటూ దీనికి చికిత్సను తీసుకున్నాడు. ఇలా పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే గడిపాడు. ఈ క్రమంలోనే అతడికి వారం రోజుల క్రితమే నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన ఎన్టీఆర్.. డాక్టర్లకు, తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.

  యంగ్ టైగర్ ఇంట్లో శుభకార్యం

  యంగ్ టైగర్ ఇంట్లో శుభకార్యం

  జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఓ శుభకార్యం జరిగినట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. అతడి చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌కు ఆదివారం అక్షరాభ్యాసం నిర్వహించారట. దీనిని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తారక్ ఓ పూజారితో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ఈ మేటర్ బయటకు వచ్చింది. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
   ఇప్పుడే చేయడానికి కారణమిదే

  ఇప్పుడే చేయడానికి కారణమిదే

  సాధారణంగా అక్షరాభ్యాసం మూడో ఏటనో ఐదో ఏటనో నిర్వహిస్తుంటారు. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ 2018 జూన్ 14న జన్మించాడు. అంటే అతడికి ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తోంది. మరో 15 రోజులైతే నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టేస్తాడు. అందుకే అక్షరాభ్యాసం ఇప్పుడు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక, లీకైన ఫొటోలో తారక్ కొత్త లుక్‌లో మెరిసిపోతున్నాడు.

  English summary
  Tollywood Star Hero Jr NTR Held Family Function on Sunday. In This Occasion He Did his Son Bhargav Ram Aksharabhyasam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X