»   » ‘పడ్డానండి ప్రేమలో మరి’: జూ ఎన్టీఆర్

‘పడ్డానండి ప్రేమలో మరి’: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పడ్డానండి ప్రేమలో మరి" అని గజాల తో ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెంబర్ 1" చిత్రంలో పాట పాడుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే పాటను ఎన్టీఆర్ నిజ జీవితంలో పాడుకుంటున్నాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆ ప్రేమ కహాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ప్రస్తుతం నా జీవితం సినిమాలకు అంకితమైపోయింది". ప్రేమ, పెళ్ళికి సమయం లేదు.

అయినా ప్రేమలో పడ్డా, నిండా మునిగిపోయా, నా తొలి ప్రేమతో చాలా బిజీగా ఉన్నాను అంటూ వృత్తి పట్ల తనకి ఉన్న ప్రేమని చల్లగా చాటుకున్నారు జూ ఎన్టీఆర్. అంతే కాకుండా నటుడిగా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహానటుడు నందమూరి తారక రామారావు గారి మనవడు అని పిలిపించుకోవడానికే ఇష్టపడతానని తాత గారి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, కాజల్ జంటగా 'బృందావనం"లోనూ, ఇలియానతో 'శక్తి" సినిమాలో నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu