»   » జూ ఎన్టీఆర్ చేతికొచ్చింటే కాలుతో సమాదానం చెప్పేవాడు!

జూ ఎన్టీఆర్ చేతికొచ్చింటే కాలుతో సమాదానం చెప్పేవాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మధురమైన, పసందైన పాటలు నేడు రీమిక్స్ కు గురవుతున్నాయి. ఇలా ఇప్పటి వరకు చాలా పాటలొచ్చినా..రెండు రీమిక్స్ పాటలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఘరానా మొగుడు కోసం ఎంఎం కీరవాణి స్వరపరచిన 'బంగారు కోడి పెట్ట.." సాంగ్ ను మగధీర కోసం ఆయనే రీమేక్ చేశారు. మరికొంత ఎక్కువ ఫ్లేవర్ జత చేసి పాట ట్యూన్, బీట్ ఎక్కడ చెడకుండా జాగ్రత్త పడ్డాడు. దాన్ని అంతే అందంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు.

ఇక రెండో పాట విషయానికొస్తే మంగమ్మగారి మనవుడులోని 'దంచవే మంగమ్మ మనవడా.." పాటను రైడ్ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. గాయని సాయి శివాని వాయిస్ రీమిక్స్ సాంగ్ కు ప్లస్ అయింది. అలాగే కొరియోగ్రఫీ నాని ఎనర్జిటిక్ స్టెప్స్ ఈ సాంగ్ బాగా రావడానికి దోహదపడ్డాయి. ఇదే పాట ఎన్టీఆర్ చేతిలో పడితే కాళ్లతో స్టెప్పులేసి సమాధానం చెప్పేవాడు. ఇరగదీసి దంచేసేవాడు. అంటే పాట ఒక రేంజ్లో ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ జూ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో 'ఓలెమ్మి తిక్కరేగిందా.." సాంగ్ ఎంత హిట్ అయి, ప్రక్షకులచేత స్టెప్పులేయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లరి రాముడులోని 'ఆకు చాటు పిందె తడిసే" పాటను 'బృందావనం" సినిమాలో రీమిక్స్ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ సినీవర్గాల సమాచారం మరి మరో రీమిక్స్ వీక్షించుటకు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu