»   » 'మెగాస్టార్' చిరంజీవి కాదా..?? ఎన్టీఆరా..!?

'మెగాస్టార్' చిరంజీవి కాదా..?? ఎన్టీఆరా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక జూ ఎన్టీఆర్ గురించి ఓ వార్త ప్రచురించింది. అందులో ఎన్టీఆర్ పేరుకు ముందు యంగ్ టాగర్ అనే బిరుదుకు బదులు మెగాస్టార్ ఎన్టీఆర్ అని పేర్కొంది. ఈ వార్త చదివిన వారంతా మెగాస్టార్ టైటిల్ చిరంజీవిది కదా..? మరి ఎన్టీఆర్ కు ఎందుకు పెట్టారబ్బా అని ఆశ్చర్యపోయారు. తీరా పూర్తి వార్త చదివిన తర్వాత కానీ అర్థం కాలేదు.. మెగాస్టార్ స్టార్ చిరంజీవి స్థానాన్ని భర్తీ చెయ్యగల ఒకేఒక్క నటుడు ఎన్టీఆర్ అని చెప్పడానికి ఎన్టీఆర్ కు మెగాస్టార్ బిరుదును కట్టబెట్టారని.

కానీ ఈ వార్త చిరు అభిమానులకు గానీ, నందమూరి అభిమానులకు గానీ ఏ మాత్రం రుచించలేదట. కారణం మెగాస్టార్ లాంటి నటుడు ఇంకొకరు రాలేరని, అలాంటిది కేవలం ఓ డజను సినిమాలు కూడా పూర్తి కానీ ఆ బుడ్డోడికి ఈ టైటిల్ తగిలించడం మెగాస్టార్ కే అవమానం అని చిరు అభిమానులు భావిస్తుండగా, అసలు మా హీరో మెగాస్టార్ కన్నా రెండాకులు ఎక్కువే చదివాడు, చిరు ఇంతవరకూ చెయ్యలేనటువంటి పౌరాణిక పాత్రలు చేసి తను చిరు కన్నా గ్రేట్ అని నిరూపించుకున్నాడు..అలాంటిది మా హీరోకు మెగాస్టార్ టైటిల్ అంటించడం యంగ్ టైగర్ కు అవమానంగా భావిస్తున్నట్టు నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరిగోల ఎలా వున్నా సినీపరిశ్రమ పెద్దలు మాత్రం చిరు తర్వాత ఆ స్టామినా, ఎనర్జీ వున్న నటుడు ఎన్టీఆరే అని చెప్పుకోవడం గమనార్హం..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu