Just In
Don't Miss!
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- News
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ డైరక్టర్ కి సెకండ్ టైమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జూ ఎన్టీఆర్...!?
ప్రస్తుతం తమిళంలో, తెలుగులో బిజీగా వున్న తమన్నా తెలుగు లో గీతా ఆర్ట్స్ నిర్మించే రెండు చిత్రాల్లో నటిస్తుంది. అందులో ఒకటి అల్లు అర్జున్ సరసన నటించే బద్రీనాథ్ కాగా, మరొకటి నాగార్జున, సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం.
కాగా ఈ చిత్రాల తర్వాత తమన్నా జూ ఎన్టీఆర్ తో జతకట్టనుందని సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో అశోక్ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఛత్రపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర" బ్యానర్ లో నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన 'అశోక్" చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా, రీసెంట్ గా రవితేజ తో 'కిక్" సినిమాతో చాలా పాపులర్ అయిపోయారు. తర్వత జూ ఎన్టీఆర్ తో చేయడానికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, కథ సిద్దంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్ చిత్రంగా 'శక్తి"లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదలవుతుందని సమాచారం.