»   » ‘కుమారి 21ఎఫ్’: స్పెషల్ షో చూసి ఎన్టీఆర్ ట్వీట్

‘కుమారి 21ఎఫ్’: స్పెషల్ షో చూసి ఎన్టీఆర్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా తీస్తున్న సుకుమార్... ఎన్టీఆర్ కోసం ‘కుమారి 21ఎఫ్' స్పెషల్ షో వేసారు. సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఇదొక న్యూ లవ్ స్టోరీ. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతాప్, దేవి, రాండీ ఎక్సలెంట్. హెబ్బ, రాజ్ చాలా బాగా నటించారు. సుకుమార్ గారు హార్ట్ టచింగ్ స్టోరీ అందించారు. హాట్సాఫ్ ఫర్ ది బ్రేవ్ అండ్ బోల్డ్ రైటింగ సర్' అంటూ ట్వీట్ చేసారు.
రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న(నేడు) విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Jr NTR tweet about Kumari 21F

దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.


English summary
NTR took to his Twitter page and tweeted, “A new age luv story..KUMARI 21F.throughly loved it!!!Pratap Devi and Randy excelled to the highest.heebah and raj were at their best. Last but not the least a very heart touching story from the master himself SUKKU Garu..hats off for the brave and bold writing sir.”
Please Wait while comments are loading...