»   » ఆ రోజులు గుర్తుకు చేసుకుని, ఎన్టీఆర్ ఎమోషన్ అయ్యారు

ఆ రోజులు గుర్తుకు చేసుకుని, ఎన్టీఆర్ ఎమోషన్ అయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తన తాతగారికి నివాళులు అర్పించిన ఎన్టీఆర్ అక్కడ ఎమోషన్ అయ్యారని సమాచారం. తన తాతగారితో తన చిన్నప్పుడు గడిపిన రోజులు గుర్తు చేసుకున్నారట. వాటిని జనతాగ్యారేజ్ టీమ్ అయిన దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి, మోహన్ లతో పంచుకున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం'జనతా గ్యారేజ్‌'. ఈ చిత్రం టీమ్ ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ కు తరలి వెళ్లింది. ఎన్టీఆర్, ఆయనతో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు ఇద్దరూ, దర్శకుడు కొరటాల శివ ఉన్నారు.

వీరంతా కలిసి నటసార్వభౌముడు నందమూరి తారకరామారావుకు నివాళులర్పించారు. ఈ రోజు స్పెషాలటి ఏమటి..హఠాత్తుగా ఈ రోజు వెళ్లాల్సిన అవసరం ఏమిటీ అంటే... మే 28న ఎన్టీఆర్‌ జయంతి రోజున... తారక్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం చెన్నైలో ఉండాల్సి వస్తుంది.

ఈ కారణంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇవాళే ఎన్టీఆర్‌ గార్డెన్‌కు చేరుకుని తన తాతయ్యకు నివాళులర్పించారు. ఆయనతోపాటు 'జనతా గ్యారేజ్‌' యూనిట్‌ సభ్యులు కూడా గార్డెన్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను మీకు స్లైడ్ షో ద్వారా అందిస్తున్నాం.

స్లైడ్ షోలో ఆ ఫొటోలను చూడండి...

భక్తిగా

భక్తిగా

ఎన్టీఆర్ కు తొలి నుంచి తన తాతయ్య తారకరామారావు అంటే ఎనలేని భక్తి

పేరు

పేరు

ఈ తారక రాముడుకు తన పేరుని పెట్టి దీవించింది ఆ తారకరాముడే

పోలికలే కాదు

పోలికలే కాదు

ఆ ఎన్టీఆర్ కు ఈ ఎన్టీఆర్ కు కేవలం పోలికలోనే కాదు క్రమశిక్షణ, పట్టుదల,ముందుకు పోయే తత్వంలోనూ దగ్గర పోలికలు ఉన్నాయి

కొరటాల శివ

కొరటాల శివ

జనతాగ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ..నివాళులు అర్పించి ఆశీస్సులు తీసుకున్నారు.

పూలతో

పూలతో

ఆ తారకరాముడుకి పూలు సమర్పించి, ఆశ్వీర్వాదం పొందారు

మనస్పూర్తిగా

మనస్పూర్తిగా

ఎన్టీఆర్ క్రమం తప్పకుండా తన తాతగారికి ఎనలేని భక్తితో ప్రతీ సంవత్సరం నివాళులు అర్పిస్తూంటారు

ఆశీస్సలు

ఆశీస్సలు

పెద్దాయన ఆశీస్సలు ఎప్పుడూ తనపై ఉన్నాయని, ఉంటాయని ఎన్టీఆర్ నమ్ముతూంటారు

దర్శకుడుకి

దర్శకుడుకి

దర్శకుడు కొరటాల శివకు సైతం తారకరామారావు అంటే ఎనలేని గౌరవం. ఆయనకు ఈ సందర్బంగా నివాళులు అర్పించే అవకాసం దక్కింది.

English summary
jr.Ntr visited NTR Ghat today to pay his respects as he'll b in Chennai on May28th for #JanathaGarage shoot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu