»   » రామ్ చరణ్ చిత్రానికి జూ ఎన్టీఆర్ వాయిస్!

రామ్ చరణ్ చిత్రానికి జూ ఎన్టీఆర్ వాయిస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్న నాలుగు కుటుంబాల హీరోల మధ్య పోటీ వాతావరణం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక వారి అభిమానుల మధ్య వాతావరణం ఎప్పుడూ వాడి వేడిగానే ఉంటుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఒక హీరో మరొక హీరో సినిమా కోసం పని చేయడం ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా ‘జల్సా' కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో హైలెట్. తాజాగా రామ్ చరణ్ సినిమాకు జూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా ఎన్టీఆర్ ను సంప్రదించి ఇందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

Jr NTR Voice Over For Ram Charan's Movie?

ఈ సినిమాలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. సినిమాలో కథలో భాగంగా.... చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రానికి రామ్‌చరణ్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తూ కనపడతాడు. రామ్‌చరణ్‌తో ఆయన శ్రీనువైట్ల చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్‌' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.

ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Film Nagar source said that, Jr NTR To Lend Voice Over For Ram Charan's Movie.
Please Wait while comments are loading...