»   » జూ ఎన్టీఆర్ పెళ్లి ఖర్చు 100 కోట్లా!??

జూ ఎన్టీఆర్ పెళ్లి ఖర్చు 100 కోట్లా!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన తాతయ్య మహానటుడు ఎన్టీ రామా రావు గారి పోలికలను పుణికిపుచ్చుకున్న జూ ఎన్టీఆర్ వివాహం తన తాతగారి వివాహం రోజునే జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలి కాలంలో చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారిన జూ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహం తన తాతగారయిన ఎన్టీఆర్, బసవతారకంల పెళ్లి జరిగిన మే 21వ తారీఖునే జరగనుందని సమాచారం.

అయితే లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాస్ ఈ వివాహాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరపాలని చాలా ఆత్రుతగా ఉన్నారట. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత తన పెంపుడు కొడుకు పెళ్ళిని 100కోట్ల రూపాయల ఖర్చుతో, లారీల కొద్దీ పట్టు చీరలూ, పట్టు పంచలను పంచి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ వివాహం జరిగిన విధానాన్ని తెలుసుకుని ఆ పెళ్ళిని మించే రీతిలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu