»   » ముగ్గరు మాస్ స్పెషలిస్టుల తో జూ ఎన్టీఆర్...

ముగ్గరు మాస్ స్పెషలిస్టుల తో జూ ఎన్టీఆర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత ఏడాది జూ ఎన్టీఆర్ సాధించిన అదుర్స్, బృందావనం రెండు హిట్లతో అందరి కన్నా సక్సస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు, బాక్సాఫీసు దద్దరిల్లేలా దుమ్ము దులిపే ఆలోచన లేకుండా సేఫ్ ప్రాజెక్ట్ లు చేసుకుంటున్న ఎన్టీఆర్ ఈ ఏడాది ట్రాక్ మార్చాడు. మునుపెన్నడూ కనీవిని ఎరుగని నిర్మాణ విలువలతో రాబోతున్న 'శక్తి"కి తోడుగా సురేందర్ రెడ్డి సినిమా కూడా ఒప్పుకోవటంతో జూ ఎన్టీఆర్ 2011 లో రెండు సినిమాలు చేసే వీలు దొరికినట్టు అయ్యింది.

కానీ ఇప్పుడేమో రానున్న ఉగాదికి బోయపాటి శ్రీను కొత్త చిత్రం కూడా ప్రారంభం కాబోతున్నట్టు వార్త వింటుంటే కలిసొస్తే రెండు కాదు ఈ సంవత్సరానికి మూడు సినిమాలిచ్చేలా ఉన్నాడు జూ ఎన్టీఆర్. పైగా ముగ్గురు దర్శకులు మాస్ స్పెషలిస్ట్ లు కావటంతో 2010 లాగా కాకుండా ఈ ఏడు యంగ్ టైగర్ ఎంతలా గాండ్రిస్తాడేమో చూడాలి మరి...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu