»   »  జూ.ఎన్టీఆర్ బరువుపై పునరాలోచన?

జూ.ఎన్టీఆర్ బరువుపై పునరాలోచన?

Posted By:
Subscribe to Filmibeat Telugu
జూనియర్ ఎన్టీఆర్ ను రాఖీ సినిమాలో ఇలియానా ఏయ్ మోటు అంటుంది. పాపం ఈ మోటు చాలా కష్టపడి యమదొంగ సినిమా కోసం చాలా సన్నబడ్డాడు. యమదొంగ సినిమా విజయం సాధించింది. ఆ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ లావు తగ్గడంతో పాటు దరిద్రం కూడా పోయిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే ఆయన అభిమానుల తీరు వేరుగా ఉంది. కొందరు ఆయన బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారంటుండగా, మరికొందరు స్లిమ్ గా ఉంటేనే బాగున్నాడని విభిన్న అభిప్రాయాలను వెలువరిస్తున్నారట. అభిమానుల అభిప్రాయలతో జూనియర్ ఆలోచనల్లో పడ్డాడట. అన్ని కోణాలను పరిశీలిస్తున్నాడట. పరిశీలనలో ఉండగానే కొంచెం బరువు కూడా పెరిగాడట. మరింత పెరుగుతాడో లేక బ్రేక్ వేస్తాడో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X