»   » ట్రైలర్ అదిరింది బాసూ.... చైతూ లేదా అఖిల్ అయితే టాలీవుడ్లో అదిరిపోద్ది!

ట్రైలర్ అదిరింది బాసూ.... చైతూ లేదా అఖిల్ అయితే టాలీవుడ్లో అదిరిపోద్ది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'జుద్వా 2' మూవీ ట్రైలర్ రిలీజైంది. వరుణ్ ధావన్, తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకుడు. 1997లో వచ్చిన 'జుద్వా' చిత్రానికి ఇది రీమేక్.

  అప్పట్లో వచ్చిన 'జుద్వా' చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా...... డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. 23 ఏళ్ల తర్వాత అదే దర్శకుడు తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంది.

  తెలుగు ‘హలో బ్రదర్’ ఆధారం

  తెలుగు ‘హలో బ్రదర్’ ఆధారం

  1994లో నాగార్జున హీరోగా ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ‘హలో బ్రదర్' చిత్రానికి హిందీ రీమేక్ ‘జుద్వా'. ఇపుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘జుద్వా 2' తెరకెక్కించారు.

  వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం

  వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం

  ఈ చిత్రంలో వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రేమ్ అనే క్లాస్ పాత్రలో, రాజా అనే మాస్ పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే హలో బ్రదర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది.

  కథలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

  కథలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

  ట్రైలర్ చూస్తుంటే ‘జుద్వా' చిత్రాన్నే ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా సీన్లు మార్చి ప్రజంట్ చేసినట్లు అనిపిస్తోందే తప్ప.... మూల కథ అదే అనే ఫీలింగ్ కలిగించేలా ట్రైలర్ ఉండటం మైనస్ పాయింట్.

  హాట్ హాట్ సీన్లు

  హాట్ హాట్ సీన్లు

  ఈ చిత్రంలో వరుణ్ ధావన్, తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మధ్య హాట్ హాట్ సీన్లు చిత్రీకరించారు. ముఖ్యంగా వీరి మధ్య వచ్చే ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ప్రేక్షులను బాగా ఎంటర్టెన్ చేయబోతున్నాయి.

  కమర్షియల్ ఎలిమెంట్స్

  కమర్షియల్ ఎలిమెంట్స్

  కమర్షియల్ అంశాలకు ఏమాత్రం లోటు లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో దర్శకుడిగా దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న డేవిడ్ ధావన్ ఇందులో కావాల్సినంత మసాలా దట్టించారు.

  బికినీలో అదరగొట్టిన తాప్సీ

  బికినీలో అదరగొట్టిన తాప్సీ

  హీరోయిన్ తాప్సీ ‘జుద్వా 2' చిత్రంలో బికినీలో అభిమానులకు కనువిందు చేయబోతోంది. గతంలో తెలుగులో పలు చిత్రాల్లో ఆమె హాట్ హాట్‌గా గ్లామర్ ప్రదర్వన చేసినప్పటికీ ఈ చిత్రంలో డోస్ మరింత పెంచింది.

  కావాల్సినంత కామెడీ

  కావాల్సినంత కామెడీ

  ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్‌తో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి కావాల్సినంత కామెడీ కూడా దట్టించారు. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం అనే భావన ట్రైలర్ చూస్తే కలుగుతోంది.

  ముద్దు సీన్లే ముద్దు సీన్లు

  ముద్దు సీన్లే ముద్దు సీన్లు

  ఇవన్నీ ఉన్నాక శృంగార రసం లేకుంటే ఏం బావుంటుంది? ఆ తరహా సీన్లు కోరుకునే వారిని కూడా ఏ మత్రం నిరాశ పరచకుండా సినిమాలో ముద్దు సీన్ల రూపంలో శృంగార రసం ఒలికించారు.

  ట్రైలర్ అదుర్స్

  జుద్వా 2 ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. జుద్వా మూవీ చూడని ఈ తరం జనరేషన్‌కు ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది. అయితే నిన్నతరం వారికి మాత్రం ఈ ట్రైలర్ కాస్త కామన్ అనిపిస్తోంది.

  తెలుగులో చైతు లేదా అఖిల్ బావుంటుంది

  తెలుగులో చైతు లేదా అఖిల్ బావుంటుంది

  ఈ ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకలు...... ఇది నాగార్జున మూవీకి రీమేక్ స్వీక్వెల్ కాబట్టి తెలుగులో చైతూ లేదా అఖిల్ చేస్తే అదిరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Judwaa 2 Official Trailer released. Two brothers (twins) born to a honest businessman are separated at birth when their father exposes a smuggling racket and a king pin. One of the brothers is thought to be dead but only resurfaces stronger after living life on the streets to reunite with his family over a sequence of events and twist of fate. Genetically bound by reflexes both the brother’s lives interlink in strange ways and a comedy of errors. They eventually come together to destroy the smuggling nexus and save their family from a downfall that awaits them.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more