స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమాలో మన హీరోయిన్

By Bojja Kumar

ముంబై: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జుహి చావ్లా హాలీవుడ్ మూవీ లెజెండ్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి పని చేయబోతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ లాస్సే హాల్ స్ట్రోమ్ మరియు స్టీవెన్ స్పీల్ బర్గ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సైన్ చేసిన జూహీ చావ్లా త్వరలో షూటింగులో పాల్గొన బోతోంది.

'ది హండ్రెడ్ ఫుట్ జర్నీ' పేరుతో తెరకెక్కే ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఓ ఇండియన్ మ్యార్రిడ్ కపుల్ చుట్టూ కథ తిరుగుతుంది. ఫ్రాన్స్‌లోని ఓ చిన్న విలేజ్‌లో సెటిలవ్వాలని ఆలోచనలో ఓ ఫ్రెంచ్ రెస్టారెంట్ ఎదరుగా చిన్ని ఇండియన్ రెస్టారెంట్ మొదలు పెడతారు. ఫ్రెంచి రెస్టారెంటు ఓనరుగా ఆస్కార్ విన్నింగ్ నటి హెలెన్ మిర్రెన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓంపురి లీడ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అని భార్య పాత్రలో జుహి చావ్లా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ నావెలిస్ట్ సి.మారియాస్ నవల 'ది హండ్రెడ్ ఫుట్ జర్నీ' ఆధారంగా అదే పేరుతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఫ్రేమస్ హోస్ట్ ఓఫ్రా విన్‌ఫ్రే, జులియట్ బ్లాక్ కో ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. జుహీ చావ్లా ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ గ్రేటెస్ట్ యాక్టర్లతో కలిసి నటించబోతున్నారు. ఇలాంటి అవకాశం రావడంపై జుహీ చావ్లా చాలా సంతోషంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X