»   » అంత చూపిస్తున్నా ఒక్క కట్ కూడా చెప్పలేదు: జూలీ 2 , ఆశ్చర్యమైన విషయం ఇదే

అంత చూపిస్తున్నా ఒక్క కట్ కూడా చెప్పలేదు: జూలీ 2 , ఆశ్చర్యమైన విషయం ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

లక్ష్మీ రాయ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం 'జూలీ -2'. బోల్డ్, బ్యూటిఫుల్, బ్లెస్సెడ్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రం దానికి తగ్గట్టే చాలా బోల్డ్ గా రూపొందింది. దీపక్ శివదాసని దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న జూలీ-2 సినిమాలో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న రాయ్ లక్ష్మి తాజాగా విడుదలైన ట్రైలర్‌తో యూత్‌ను హీటెక్కిస్తోంది. టీజర్‌ను మించిపోయేలా ట్రైలర్ ఉంది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో సంచలనంగా మారిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్

రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్

ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా.. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది ..

చూసి చూడనట్టుగా

చూసి చూడనట్టుగా

అయితే సెన్సార్ తతంగం ముగియగానే జనానికి చిన్నపాటి షాక్ తగిలినట్టయ్యింది ఎందుకంటే సెన్సార్ బోర్డ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక్కో సినిమా విషయంలో చాలా కఠినంగా వ్యవహిరంచే సెన్సార్ సభ్యులు కొన్ని సినిమాల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వెళ్లిపోతున్నారు.

ఎక్స్ జోన్ సినిమాపై నిషేదం

ఎక్స్ జోన్ సినిమాపై నిషేదం

పహ్లజ్ నిహ్లాని సెన్సార్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తరువాత ఇక వివాదాలకు తెరపడినట్టే భావించారు.అయితే కొత్త చైర్మన్ ప్రసూన్ జోషి వస్తూ వస్తూనే ఎక్స్ జోన్ సినిమాపై నిషేదం విదించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ప్రసూన్ కూడా అడల్ట్ సినిమాలను ఇబ్బంది పెడతారని భావించారు.

ఎలాంటి కట్స్ సూచించకుండా

ఎలాంటి కట్స్ సూచించకుండా

కానీ అనూహ్యంగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన జూలీ 2 సినిమాకు ఎలాంటి కట్స్ సూచించకుండా ఏ సర్టిఫికేట్ ఇచ్చి మరో షాక్ ఇచ్చారు ప్రసూన్. ట్రైలర్ లో అందాల ఆరబోతతో ఆదరగొట్టిన జూలీ, సినిమాలో కట్ చెప్పే స్థాయిలో విజువల్స్ లేవంటే ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. ఆనిటికంటే పెద్ద షాకేంటో తెల్సా... నిన్నా మొన్నటి వరకు ఇలాంటి సినిమాలను అసలు రానివ్వకూడదు అంటూ కట్స్ మీద కట్స్ చెప్పిన పహ్లాజ్ నిహ్లానీనే ఈ సినిమా హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ . ..

English summary
Julie 2, the new erotic thriller which is being presented by former CBFC chief Pahlaj Nihalani has been cleared with an ‘A’ certificate by the Prasoon Joshi-led censor board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu