»   » నాగార్జునకి 'జంప్‌ జిలానీ' తోడు

నాగార్జునకి 'జంప్‌ జిలానీ' తోడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జనాలు ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న చిత్రంతో తమ ట్రైలర్ ని విడుదల చేస్తే కాస్త ఎక్కువమంది చూసే అవకాసం ఉంటుందని సినిమావాళ్లు భావిస్తూంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తూంటారు. తాజాగా అల్లరి నరేష్ చిత్రం 'జంప్‌ జిలానీ' ట్రైలర్ ని అక్కినేని కుటుంబ చిత్రం 'మనం' తో పాటు పంపటానికి ఏర్పాట్లు పూర్తి చేసారు.

అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయంతో తెరకెక్కుతున్న చిత్రం 'జంప్‌ జిలానీ'. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌ హీరోయిన్స్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''త్వరలోనే ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తాం. 'మనం' సినిమాతోపాటుగా అన్ని థియేటర్లలోనూ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాం'' అన్నారు నిర్మాత.

Jump Jilani trailers to be screened along with Manam

దర్శకుడు మాట్లాడుతూ ''అన్నదమ్ముల కథ ఇది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని కాపాడుకోవడానికి హీరో ఎన్నిపాట్లు పడ్డాడన్నది తెరపైనే చూడాలి. ఒక పాత్రలో క్లాస్‌గా, మరొక పాత్రలో మాస్‌గా అల్లరి చేస్తారు నరేష్‌. ఇషా చావ్లా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో నటించింది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.

సమర్పకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ ''కలగలుపు అనే తమిళ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈవీవీ సత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. మా సంస్థకు 'కన్యాదానం'లాంటి సినిమా ఇచ్చారు. ఇప్పుడు నరేష్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది''అన్నారు.అంబికా, అంబానీ, అల్లరి నరేష్ అనే మూడు శక్తులతో ఈ సినిమా రూపొందుతోందని వ్యాఖ్యానించారు. ఈవీవీతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందనీ, ఆయన కుమారుడు అల్లరి నరేష్ తన కొడుకులాంటివాడేననీ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.... ''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు‌. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ... '' 'తాతల ఆస్తుల కోసం ఆరాటపడే వారసుల గురించే మనకు తెలుసు. కానీ, మా హీరో తాతల పేరు నిలబెట్టడానికి, వారి వారసత్వాన్ని కాపాడుతాడు. అందుకోసం అతను ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథహలో బ్రదర్‌ నాగార్జునకు ఎంత పేరు తీసుకొచ్చిందో.. మా సినిమా నరేష్‌కు అంత పేరు తీసుకొస్తుంది. తొలిసారి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి పాత్ర క్లాస్‌. మరోటి మాస్‌. తరతరాలుగా వస్తున్న ఆస్తిని హీరో ఎలా కాపాడుకొన్నాడు అనేదే ఈ చిత్ర కథ.'' అన్నారు.

కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్‌.నారాయణ, రఘుబాబు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్‌, వేణుమాధవ్‌, ధనరాజ్‌, జీవీ, రమేష్‌, సన, హేమ, గీతాసింగ్‌, ఖయ్యూమ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ: సుందర్‌ సి, సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అంబికాకృష్ణ.

English summary
Allari Naresh’s career first dual role movie ‘Jump Jilani’ is in last leg of production. The trailers of ‘Jump Jilani’ are to be screened along with ‘Manam’ movie. This film is touted to be a full length comedy entertainer. This news was officially confirmed by Ambika Raja, who is the one of the producers of ‘Jump Jilani’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu