»   »  ఎన్టీఆర్‌తో కలిసి ఆ సినిమా చేస్తా: నాగ చైతన్య

ఎన్టీఆర్‌తో కలిసి ఆ సినిమా చేస్తా: నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుండమ్మ కథ.. తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా సావిత్రి, జమున హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ సినిమా ఇది. అయితే ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని పలువురు సినీ ప్రముఖులు చెప్పడం అప్పుడప్పుడూ వింటూనే ఉన్నాం. ఆమధ్య మంచు మోహన్ బాబు కూడా అలనాటి 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ తర్వాత పెద్దగా ఇంట్రస్త్ చూపలేదు.

బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా

బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా

ఈ గుండమ్మ కథ రీమేక్ ఇప్పటి ఆలోచన కాదు బాలయ్యా, నాగార్జునలు యంగ్ హీరోలుగా ఉన్న కాలం నుంచీ ఈ క్లాసిక్ రీమేక్ అలా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమాను మళ్లీ ఆ ఇద్దరు వారసులతో రీమేక్ చేయాలని చాలాకాలంగా వార్తలు వచ్చేవి. అంటే బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా అన్నమాట.

ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా

ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా

కానీ అదిజరగలేదు. ఇక ఆ తర్వాత వారి థర్డ్ జనరేషన్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. గుండమ్మ కథే కాదు.. మిస్సమ్మలో కూడా ఈ ఇద్దరూ కనిపించబోతున్నారని సమాచారం. అయితే పూర్తిగా రీమేక్ కాదు కానీ.. ఓ సినిమా కోసం ఈ ఇద్దరూ గుండమ్మ కథలోని తమ తాతల పాత్రలను చేస్తారని కూడా అనుకున్నారు గానీ. ఈ వార్తలన్నీ వాళ్ళూ వీళ్ళూ అనుకున్నవే అధికారికంగా ఎవ్వరూ చెప్పలేదు.

నాగ చైతన్య బద్దలు కొట్టాడు

నాగ చైతన్య బద్దలు కొట్టాడు

అయితే ఈ అయోమయాన్ని అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య బద్దలు కొట్టాడు. తాను జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయడంపై స్పందించాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు కలిసి నటించిన ‘గుండమ్మ కథ'ను నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చైతూకి ఈ ప్రశ్న ఎదురైంది. ‘గుండమ్మ కథ' చేస్తున్నారా? లేదా? అని చైతన్యను ఓ అభిమాని ప్రశ్నించారు. దానికి చైతూ ఇలా సమాధానం చెప్పాడు.

Samantha Posted her Bikini photo in Instagram Goes Viral
చాలా జాగ్రత్తగా తీయాలి

చాలా జాగ్రత్తగా తీయాలి

‘‘అంత గొప్ప సినిమాను తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ సినిమా కచ్చితంగా చేయాలనే కోరిక అయితే నాకుంది. కాకపోతే ఇప్పుడు కాదు. నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చాక. తాతగారిలా కాకపోయినా నటనలో ఇంకొంచెం మెరుగయ్యాక చేస్తా. ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టు కాకుండా.. ప్రస్తుత కాలానికి.. అంటే ఇప్పుడున్న సినిమా ప్రేక్షకులకు నచ్చేలా తీయాలనుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆ సినిమాను తప్పకుండా చేస్తా.'' అని చెప్పాడు.

English summary
NTR- ANR-starrer, Gundamma Katha has just completed 50 year mark and speculations are rife about a remake to the old classic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu