»   » పెళ్లి కొడుకైన జూనియర్ ఎన్టీఆర్.. చిలుకూరు బాలాజీ టెంపుల్లో కళ్యాణం..

పెళ్లి కొడుకైన జూనియర్ ఎన్టీఆర్.. చిలుకూరు బాలాజీ టెంపుల్లో కళ్యాణం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్‌కు మళ్లీ పెళ్లి ఏంటని అనుకొంటున్నారా? ఇప్పటికే పెళ్లి అయి ఓ బాబు కూడా ఉన్న యంగ్ టైగర్ పెళ్లేంటి అని కంగారు పడకండి. జై లవకుశ సినిమా కోసం జూనియర్ మళ్లీ పెండ్లి కుమారుడిగా మారారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది.

చిలుకూరు ఆలయంలో ..

చిలుకూరు ఆలయంలో ..

మరో షెడ్యూల్‌ను చిలుకూరు ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. సినిమాలో భాగంగా ఎన్టీఆర్, రాశీఖన్నాలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం. ‘జై లవ కుశ' చిత్రంలో పెళ్లి సన్నివేశం ఒకటి ఉండగా, ఆ సీన్ ని చిలుకూరు ఆలయంలో ఎన్టీఆర్, రాశీ ఖన్నాలపై తెరకెక్కించనున్నారని తెలిసింది.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం

జై లవకుశ చిత్రం కోసం ఎన్టీఆర్ త్రిపాత్రాఢినయం చేస్తున్నారు. రాశీఖాన్నా, నివేదా థామస్, నందితలు ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 1న విడుదల..

సెప్టెంబర్ 1న విడుదల..

ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ కలెక్షన్లు రాబట్టిన జనతా గ్యారేజ్ సినిమా విడుదలైన తేదీనే జై లవకుశ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. అదే తేదీన జై లవకుశ సినిమాను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

సోషల్ మీడియాలో టెర్రిఫిక్ లుక్..

సోషల్ మీడియాలో టెర్రిఫిక్ లుక్..

జై లవకుశలోని ఓ పాత్రకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. విలన్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ మేకప్ మెన్‌ను టాలీవుడ్‌కు రప్పించారు. అత్యంత భయంకరంగా ఉన్న లుక్‌ సంబంధించిన స్టిల్ అభిమానులను షాక్ గురిచేసింది.

English summary
Jr NTR's Latest movie Jai lava Kusha shooting going with high speed. Bobby is the director for the movie. Raashi Khanna, Nivetha Thomas Starring in this movie. Jai Lava Kusa set to Releasing on Sep1st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu