»   » అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జూ ఎన్టీఆర్

అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫంక్షన్లకి సినీ ప్రముఖుల్ని పిలిచి తమ గురించి, తమ సినిమా గురించి గొప్పలు చెప్పించుకోవడం రివాజు. రాజమౌళి, సిద్దార్ద్ లాంటి వాళ్శయితే ఇలాంటి ఫంక్షన్స్‌లో ఎదుటివారిని ఊదరకోట్టడంలో సిద్దహస్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఐతే తమ సినిమా గురించి మాట్లాడడానికి ఎవరినీ పిలవకుండా, కేవలం తమ సినిమా యూనిట్ మాత్రమే హాజరయ్యేలా శక్తి ఆడియో వేడుక ప్లాన్ చేసుకున్నారు.

కాకపోతే రాష్ట్రం నలుమూలల నుండి జూ ఎన్టీఆర్ అభిమానుల్ని మాత్రం ఈవేడుకకి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఆడియో సిడిని కూడా అభిమానుల చేతుల మీదుగానే ఆవిష్కరిస్తారని కూడా చెప్పడం జరిగింది. స్టేజి మీదకు అభిమానుల అందరిని పిలవకపోయినా నందమూరి అభిమానుల స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ చేత అయినా ఆడియోని విడుదల చేయిస్తారని అనుకున్నారు. కానీ నిజానికి అలా జరగలేదు.

జూ ఎన్టీఆర్ తోలి సిడిని ఆవిష్కరించి మణిశర్మకు అందించారు. జూ ఎన్టీఆర్ ఆవిష్కరిస్తాడనే సమాచారం లేని యాంకర్ సుమ కనీ వినీ ఎరుగని రీతిలో వినూత్న పద్దతిలో శక్తి ఆడియో ఆవిష్కరింపబడుతుందని తెగ ఊదరగోట్టేసింది. చివరకి అభిమానుల్ని వేదికపైకి పిలవకుండా జూ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ఆడియోని విడుదల చేయడంతో సుమ ఖంగు తిన్నదని సమాచారం.

English summary
"Shakti is not like any other film. It is a special film. It's even more special to do hold the audio launch here in front of my fans," NTR said at the audio launch of his latest film Shakti. The audio was released by NTR and received by music composer Mani Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu