»   » ఒక్కడినే వస్తా.. చెమటపట్టకుండా చంపేస్తా.. బాలయ్య ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ షాక్..

ఒక్కడినే వస్తా.. చెమటపట్టకుండా చంపేస్తా.. బాలయ్య ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ షాక్..

Written By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జై లవకుశ రిలీజ్ సిద్ధమవుతున్నది. ఈ చిత్రంపై నందమూరి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకొన్నాడు. జై లవకుశ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానుల వద్దకు చేర్చడానికి తారక్ విస్తృతంగా ప్రమోషన్ చేస్తున్నాడు. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో ముచ్చటిస్తూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నివేదా క్యూట్

నివేదా క్యూట్

జై లవకుశలో త్రిపాత్రాభినయం చేశాను. ఆ చిత్రంలో నాకు జై పాత్ర అంటే చాలా ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంతేకాకుండా నివేదా చాలా క్యూట్‌గా ఉంటుంది. తమన్నా చాలా హాట్‌గా ఉంటుంది అని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

సీనియర్ ఎన్టీఆర్..

సీనియర్ ఎన్టీఆర్..

దివంగత నందమూరి తారక రామారావు చెప్పిన ఏ డైలాగ్ ఇష్టమని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. దాన వీర శూర కర్ణ చిత్రంలోని ‘ఏమంటివి ఏమంటివి‘ అనే డైలాగ్ ఏకధాటిగా వినిపించారు. ఆ తర్వాత కొద్ది క్షణాలు ఉద్వేగానికి గురయ్యారు.

బాలయ్య డైలాగ్‌తో అదుర్స్

బాలయ్య డైలాగ్‌తో అదుర్స్

నటసింహం బాలకృష్ణ సినిమాల్లోని ఏ డైలాగ్ ఇష్టమని అడుగగా నరసింహనాయుడు చిత్రంలోని ‘ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. !' అనే డైలాగ్‌ను తారక్ నవ్వుతూ చెప్పారు.

నందమూరి అభిమానులకు షాక్

నందమూరి అభిమానులకు షాక్

ఈ డైలాగ్‌లో చివరి లైన్‌ను ఎన్టీఆర్ మార్చి చెప్పారు. ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..' అనడానికి బదులు ‘ఒక్కడినే వస్తా.. చెమట పట్టకుండా చంపేస్తా!' అని తారక్ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా బాలయ్య చిత్రంలోని చాలా డైలాగ్స్ ఇష్టమని చెప్పడం విశేషం. తన సమయస్ఫూర్తితో నందమూరి అభిమానులందరినీ ఎన్టీఆర్ ఆకట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.

English summary
Junior NTR is very busy with Biggboss and Jai Lava Kusa promotions. As part of promotion NTR attended for News Channel interview recently. In this episodes NTR spells Senior NTR, and Balakrishna dialogues on request of anchor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu